NTV Telugu Site icon

Unstoppable: బాహుబలి ఎపిసోడ్ అనుకున్న దానికన్నా ముందే…

Unstoppable Prabhas

Unstoppable Prabhas

న్యూ ఇయర్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలియదు కానీ డిసెంబర్ 30 కోసం మాత్రం తెలుగు సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఆరోజే బాహుబలి ప్రభాస్, నటసింహం బాలయ్య, మ్యాచో మ్యాన్ గోపీచంద్ కలిసి సందడి చేసిన ‘అన్ స్టాపబుల్ సీజన్ 2 కొత్త ఎపిసోడ్’ బయటకి రానుంది. ఈ ఎపిక్ ఎపిసోడ్ లో ప్రభాస్ ఏం మాట్లాడుతాడో అని పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తారు కాబట్టి ‘ఆహా’ వాళ్లు ఎపిసోడ్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేశారు. ఒక టాక్ షోలో హీరో ఏం మాట్లాడుతున్నాడు అనేది అందరికీ అర్ధం కావాలని సబ్ టైటిల్స్ ని పెట్టడం ‘ఆహా’ వాళ్లకే చెల్లింది. ‘కింగ్ సైజ్’ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా చేసి ఇందులో నుంచి పార్ట్ 1న డిసెంబర్ 30న ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తామని ఇప్పటికే అనౌన్స్ చేసిన షో రన్నర్స్, అభిమానుల కోసం ఎపిసోడ్ ని చెప్పిన దాని కన్నా ముందే రిలీజ్ చెయ్యడానికి సిద్ధమయ్యారు.

డిసెంబర్ 30కి మూడు గంటల ముందే అంటే ఈరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలోనే ఈ బహుబలి ఎపిసోడ్ లోని పార్ట్ 1ని రిలీజ్ చెయ్యనున్నట్లు సమాచారం. పీక్ టైంలో బయటకి రానున్న ఈ ఎపిసోడ్ కోసమే ‘ఆహా’ మెంబర్షిప్ కొనుకున్న వాళ్లు కూడా ఉన్నారు అతిశయోక్తి కాదు. ఇప్పటివరకూ జరిగిన అన్ని అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ కన్నా ఎక్కువగా, ఇప్పటివరకూ ఏ టాక్ షో వాళ్లు ఎన్నడూ చేయ్యనంతగా ప్రభాస్ ఎపిసోడ్ ని ప్రమోట్ చేస్తున్నారు ‘ఆహా’ మేనేజ్మెంట్. ఈ ఎపిసోడ్ ని ఇండియాలోనే హైయెస్ట్ వ్యూవర్షిప్ సాధించిన ఎపిసోడ్ గా మార్చాలని ప్రభాస్ ఫాన్స్ కంకణం కట్టుకోని ఉన్నారు. ప్రమోషన్స్ లో ఎక్కువగా మాట్లాడని ప్రభాస్, తన ఫ్రెండ్ అయిన హీరో గోపీచంద్ తో కలిసి ఎలాంటి సందడి చేశాడు? బాలయ్య, ప్రభాస్ ని ఎలా ర్యాగింగ్ చేశాడు? ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ తేజ్ ఏం చెప్పాడు? లాంటి ప్రశ్నలకి సమాధానం ఈ బాహుబలి ఎపిసోడ్ లో దొరికేస్తుంది, చూసెయ్యండి.