Site icon NTV Telugu

Unstoppable: అణువుని కూడా ఇరుకున పెడితే అణుబాంబు అవుతుంది…

Unstoppable

Unstoppable

యుట్యూబ్ రికార్డులు షేక్ చెయ్యడానికి బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పార్ట్ 2 ప్రోమోని దించారు ‘ఆహా’ మానేజ్మెంట్. పవన్ కళ్యాణ్-బాలకృష్ణలు కలిసి మొదటి పార్ట్ లో సెన్సేషనల్ వ్యూవర్షిప్ తీసుకోని వచ్చి కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. దాదాపు ఫన్నీగా, ఫ్రెండ్లీగా సాగిపోయిన పార్ట్ 1 ఆహా సర్వర్స్ క్రాష్ అయ్యేలా చేసింది. ఈసారి మాత్రం అంతకుమించి అనే రేంజులో పార్ట్ 2 ఉండబోతుంది. ఆ సాంపిల్ చూపించడానికే పార్ట్ 2 ప్రోమోని రిలీజ్ చేశారు. 20K రీట్వీట్స్ వస్తే సీజన్ ఫైనలే ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేస్తాం అని ఆహా అనౌన్స్ చెయ్యడంతో, అది మాకు జుజుబీ అంటూ 20K టార్గెట్ ని పవన్ ఫాన్స్ ఊదవతలేసారు. దీంతో టార్గెట్ రీచ్ అయిన ఆహా, చెప్పినట్లుగానే ప్రోమోని రిలీజ్ చేసింది. పార్ట్ 1కి కంప్లీట్ కాంట్రాస్ట్ గా పార్ట్ 2 సీరియస్ నోట్ లో జరగబోతుంది అనే హింట్ ఇచ్చిన ఈ ప్రోమో. పవన్ కళ్యాణ్, జనసేనలని ఉద్దేశిస్తూ జనాల్లో ఉన్న డౌట్స్ బాలయ్యతో అడిగించడంతో ఎపిసోడ్ రసవత్తరంగా మారేలా ఉంది. పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? TDPలో జాయిన్ అయితే అయిపోతుంది కదా? అభిమానులు ఓట్లు ఎందుకు వెయ్యట్లేదు? పార్టీ మానిఫెస్టో ప్రజల్లోకి వెళ్లకపోవడం కారణంగానే జనసేన ఓడిపోయిందా? లాంటి ప్రశ్నకి ప్రోమోలో చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించాయి. మరి వీటికి పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు చెప్తాడో చూడాలి.

ఇక ఎపిసోడ్ 2లో క్రిష్ గెస్టుగా వచ్చాడు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో వర్క్ చేసిన క్రిష్ తో కాసేపు సరదాగా మాట్లాడించారు. ప్రోమో ఎండ్ లో బాలయ్య “అణువుని కూడా ఇరుకున పెడితే అణుబాంబు అవుతుంది” అని చెప్పిన డైలాగ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ సూపర్ గా ఉన్నాయి. ఫిబ్రవరి 10న ఈ బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పార్ట్ 2 ప్రీమియర్ కానుంది. ఆ రోజు మరోసారి ఓటీటీ వ్యూవర్షిప్ లో కొత్త రికార్డులు క్రియేట్ చెయ్యడానికి మెగా అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే సీజన్ 2 ఎండ్ అవుతుంది కాబట్టి అన్-స్టాపబుల్ సీజన్ 3 ఉంటుందా లేక ఇక్కడితో ఈ టాక్ షోకి బాలయ్య ఎండ్ కార్డ్ వేస్తాడా అనేది చూడాలి.

https://www.youtube.com/watch?v=P2uqvb8EAZI

 

Exit mobile version