Unknown Facts about MP Kangana Ranaut: 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్ పోటీ చేశారు. ఇప్పుడు మండి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, సిట్టింగ్ ఎంపీ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌లపై కంగనా విజయం సాధించారు. ఆమెకు బాలీవుడ్ తారల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Allu Arjun : అల్లు అర్జున్ ప్రచారం చేసిన వైసీపీ నంద్యాల అభ్యర్థి పరిస్థితి ఇదే!
ఇక ఆమె గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇక సినిమాల్లో నటించేందుకు చాలా మంది నటీనటులు ఊరు వదిలి పారిపోయిన కథలు మనం విన్నాం. అయితే సినిమా కోసం ఊరు వదిలి పారిపోయిన కోవకు కంగనా కూడా చెందుతుంది. చదువును సగంలోనే వదిలేసి, 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి, ఉండేందుకు చోటు లేకుండా ప్లాట్ ఫాంపై జీవించిన ఆమె నేడు లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతోంది. ఆమె మరెవరో కాదు నటి కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని బాంబియా అనే పట్టణంలో జన్మించిన కంగనా రాజ్‌పుత్ కుటుంబానికి చెందినది. ఆమె తల్లి ఆశా పాఠశాల ఉపాధ్యాయురాలు, తండ్రి అమర్‌దీప్ వ్యాపారవేత్త. కంగనాకు ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. కంగనాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది.
అయితే దానికి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. దీంతో కంగనా 15 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి ముంబైకి పారిపోయింది. ఇక్కడ ఇళ్లు దొరక్క ఫ్లాట్ ఫారంలో నిద్రిస్తూ ఎన్నో కష్టాలు అనుభవించిందని చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో కంగనాకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ చిత్రంతో కంగనా తెరంగేట్రం చేసింది. సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ప్యాషన్ సినిమా కంగనాకు బాలీవుడ్‌లో అతిపెద్ద విజయంగా నిలిచింది. కంగనా నటించిన తను వెడ్స్ మను భారతీయ సినిమా చరిత్రలో 100 కోట్లు సాధించిన తొలి హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా నిలిచింది.
ఆ సినిమా ద్వారా బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా కూడా వెలుగొందింది. సినిమాల్లో రాజకీయాలను బయటపెట్టడంతో ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండేది. నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా ఓ వెలుగు వెలిగిన కంగనా మణికర్ణిక అనే మాస్ హిట్ సినిమాతో దర్శకురాలిగా తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె దర్శకత్వంలో ఎమర్జెన్సీ అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కంగనా ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో తన స్వగ్రామం మండి నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేయడం గమనార్హం.