NTV Telugu Site icon

Umair Sandhu: నిన్న పవన్ ఉమనైజర్ అన్నాడు.. నేడు సమంత అబార్షన్ అంటున్నాడు

Sam

Sam

Umair Sandhu:క్రిటిక్స్ పేరుతో సోషల్ మీడియాలో కొంతమంది చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కేఆర్ కె, ఉమైర్ సంధు అనే ఈ ఇద్దరు చేసే రచ్చ అయితే అస్సలు తట్టుకోలేం. హీరోలు.. వారి పర్సనల్స్.. హీరోయిన్స్.. వారి నగ్న చిత్రాలు అన్ని నా దగ్గర ఉన్నాయని కేఆర్ కె అంటే.. టాలీవుడ్ హీరోలు ఇలాంటి వారు అంటూ ఉమైర్ సంధు చేసే ట్వీట్స్ కు అభిమానులు రెచ్చిపోయి ఆడేసుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఉమైర్.. టాలీవుడ్ హీరోలనే టార్గెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ను ఉమనైజర్ అన్నాడు. ఆ తరువాత మహేష్ బాబు.. పూజా హెగ్డే తో కలిసి ఉంటుంది అన్నాడు. దీంతో అతగాడిని టాలీవుడ్ అభిమానులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. మా హీరోల గురించి నువ్వు చెప్పేంత మగాడివి అయ్యావా అంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు. అయినా ఉమైర్ తగ్గేదేలే అంటూ నోటికి ఏది వస్తే అది ట్వీట్ చేసి లైక్స్ కోసం షోలు చేస్తున్నాడు.

Ram Gopal Varma: వర్మ.. నవీన్ హత్యకేసుపై ఓ సినిమా తీస్తే.. బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం

తాజాగా నాగ చైతన్య- సమంతల విడాకులు గురించి చెప్పుకొచ్చి ఇంకా హీట్ పెంచాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఏ మాయ చేశావే సినిమా నుంచి ప్రేమించుకున్న సామ్- చై.. పెళ్లితో ఒక్కటయ్యారు. నాలుగేళ్లు కలిసి ఉన్నాకా విబేధాల వలన ఇద్దరు విడిపోయారు. వీరి విడాకులకు కారణాలు చాలానే ఉన్నాయి. కొంతమంది సామ్ ది తప్పు అంటే.. ఇంకొంతమంది చై ది తప్పు అని చెప్పుకొస్తున్నారు. వారి విడాకులు అయ్యి రెండేళ్లు దాటినా ఇంకా వీరి విడాకులు హాట్ టాపిక్ గానే ఉంది. ఇక ఈ జంటపై ఉమైర్ సంధు ఘాటు ఆరోపణలు చేశాడు. “నాగ చైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా చాలా హింసించాడు. అంతేకాదు, నేను ప్రెగ్నెంట్ అయినా అతడి వల్ల అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అతని వేధింపులు తట్టుకోలేకనే విడిపోయాను. ఇప్పుడు ఇలా సాగిపోతోన్నాను” అని సమంత చెప్పినట్లు చెప్పుకొచ్చాడు.దీంతో సామ్- చై అభిమానులు ఉమైర్ ను ఏకిపారేస్తున్నారు. ఎవడ్రా నువ్వు.. నీకు సామ్ వచ్చి చెప్పిందా.. ఫేక్ న్యూస్ క్రియేట్ చేశావంటే బాగోదు అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. మరి ఈ ట్వీట్ పై సామ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Show comments