Adult Content Apps : అశ్లీల కంటెంట్ ను కంట్రోల్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అడల్ట్ కంటెంట్ ను ఎక్కువగా పబ్లిష్ చేస్తున్న ఉల్లూ సహా 25 రకాల యాప్స్, వెబ్ సైట్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ యాప్స్, వెబ్ సైట్స్ అందుబాటులో ఉండకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వెబ్ సైట్లు, యాప్స్ అన్నీ ఇక నుంచి ఇండియాలో కనిపించవు. ఇప్పటికే మన దేశంలో పోర్న్ సైట్లపై బ్యాన్ ఉంది. కానీ ఓటీటీల పేరుతో విచ్చలవిడిగా ఈ యాప్స్, వెబ్ సైట్లలో పోర్న్ కంటెంట్ ఎక్కువగా పబ్లిష్ అవుతోంది. వీటిపై ఇప్పటికే చాలా కంప్లయింట్లు వచ్చాయి. చిన్న పిల్లలు, టీనేజర్స్ ఎక్కువగా వీటికి అడిక్ట్ అవుతున్నరనే ఫిర్యాదులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also : WAR 2 Trailer : ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ.. ట్రైలర్ లో సమన్యాయం..
తాజాగా ప్రభుత్వం బ్యాన్ చేసిన వాటిల్లో ఉల్లూ, ఏఎల్‌టీటీ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లెక్స్, బూమెక్స్, నవరసా లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్, ఫెనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, ఫూగీ, మోజ్‌ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్ లాంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి మంచి నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయని కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా వాడకం విచ్చలవిడిగా పెరిగిన తర్వాత ఈ యాప్స్, వెబ్ సైట్ల పేరుతో నానా రకాల అడల్ట్ వీడియోలో ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అయిపోతున్నాయి. ఈ నిర్ణయంతో ఇక నుంచి అడల్ట్ కంటెంట్ తగ్గిపోతుందని అంటున్నారు.
Read Also : WAR 2 Trailer Review : అదిరిన విజువల్స్.. యాక్షన్ సీన్స్ సూపర్బ్..
