వివాదాలతో, ఫ్లాప్స్ తో కెరీర్ అయిపొయింది అని ప్రతి ఒక్కరూ అనుకున్న స్టేజ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టే వరకూ శింబు ప్రయాణం కోలీవుడ్ లోని ప్రతి యంగ్ హీరోకి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఒకప్పుడు షేప్ అవుట్ అయిపోయి, డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శింబు ఇప్పుడు పర్ఫెక్ట్ హీరో పర్సనాలిటీ మైంటైన్ చేస్తున్నాడు. మానాడు నుంచి మొదలైన సక్సస్ ట్రాక్ ని శింబు పత్తు తల వరకూ కంటిన్యు చేస్తూనే ఉన్నాడు. కెరీర్ గోల్డెన్ ఫేజ్ లో ఉన్న శింబు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. ‘శింబు 48’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయినా ఈ మూవీ శింబు ఫ్యాన్స్ లో జోష్ నింపింది. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న శింబు కొత్త సినిమా కోలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఒక సినిమా అనౌన్స్మెంట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడానికి కారణం ‘శింబు 48’ సినిమాని లోకనాయకుడు కమల్ హాసన్ ప్రొడ్యూస్ చెయ్యడమే. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ ‘శింబు 48’ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాకి దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లడ్ అండ్ బాటిల్ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఇచ్చేసారు. ఈ రేర్ కాంబో సెట్ అవ్వడంతో కోలీవుడ్ లో ‘శింబు 48’ హాట్ టాపిక్ అయ్యింది. విక్రమ్ సినిమాతో నాలుగు వందల కోట్లు వెనకేసుకున్న కమల్ హాసన్, ఈ మూవీ ఇచ్చిన ప్రాఫిట్స్ తో ఇతర హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కార్తీ, సూర్యతో కూడా కమల్ హాసన్ సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. విక్రమ్ 3, రోలెక్స్ వైస్ విక్రమ్ సినిమాలు కూడా కమల్ బ్యానర్ నుంచే రానున్నాయి.
🔥 #STR48
#Ulaganayagan #KamalHaasan #Atman #SilambarasanTR #RKFI56_STR48 #BLOODandBATTLE @ikamalhaasan @SilambarasanTR_ @desingh_dp#Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/RW0CUw6lFy— Raaj Kamal Films International (@RKFI) May 22, 2023
