Site icon NTV Telugu

Kamal Haasan: అన్ని సినిమాలని ఎలా సెట్ చేస్తున్నారు? ఎప్పుడు చేస్తారు?

Kamal Haasan

Kamal Haasan

విక్రమ్ సినిమాతో ఎవరు ఊహించని రేంజ్ కంబ్యాక్ ఇచ్చాడు లోకనాయకుడు కమల్ హాసన్. చాలా ఏళ్ల తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టిన కమల్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తున్నాడు. ఇప్పటికే శంకర్ తో ఇండియన్ 2 కంప్లీట్ చేసిన కమల్, ఇండియన్ 3 కోసం మరో నెల రోజుల డేట్స్ ఇచ్చాడు. ఇండియన్ 2తో పాటే 3 కూడా షూటింగ్ జరుపుకుంది కాబట్టి నెల రోజుల్లో బాలన్స్ పార్ట్ ని కంప్లీట్ చేయనున్నారు శంకర్ అండ్ కమల్. ఈ ప్రాజెక్ట్ అవ్వగానే కమల్-మణిరత్నంతో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇండియన్ 3 షూటింగ్ కంప్లీట్ అవ్వగానే మణిరత్నం సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.

ఈ మూడు సినిమాలతో పాటు కమల్ హాసన్… హెచ్ వినోద్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా అనౌన్స్ చేసాడు. యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన హెచ్ వినోద్, కమల్ తో హైఆక్టేన్ యాక్షన్ సినిమా చేయనున్నాడు. రజినీకాంత్ సినిమా, ఖైదీ 2 కంప్లీట్ అవ్వగానే లోకేష్ కనగరాజ్-కమల్ హాసన్ కలిసి విక్రమ్ 3 చేయడానికి రెడీ అవుతారు. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అయ్యే అవకాశం ఉంది. ఇవి చాలవన్నట్లు ప్రభాస్-నాగ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 AD ప్రాజెక్ట్ లో కమల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ లో కమల్ హాసన్ స్టంట్ మాస్టర్స్ అన్బారివ్ డైరెక్షన్ లో కొత్త సినిమాని అనౌన్స్ చేసాడు. అసలు ఈ సినిమాల్లో ఏది ముందు కంప్లీట్ అవుతుంది? ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయాలు కమల్ అభిమానులకి కూడా అంతుబట్టని విషయంగా ఉంది. ఏదిఏమైనా ఈ ఏజ్ లో కూడా కమల్ అంత బిజీగా ఉన్న ఇండియన్ హీరో మరొకరు లేరు అనేది అయితే వాస్తవం.

Exit mobile version