Nidhi Aggarwal: సవ్యసాచి సినినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. మొదటి సినిమాతో విజయాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, హీరోయిన్ గా మంచి అవకాశాలే రాబట్టుకోంది. mr. మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలతో నిధి కుర్ర హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఇక సినిమాలు ఒక ఎత్తు అయితే అమ్మడి ఫోటోషూట్లు మరో ఎత్తు. సోషల్ మీడియాలో కుర్రకారుకు నిద్ర పట్టనివ్వకుండా అందాలను ఆరబోస్తూ ఫాలోయింగ్ తెచ్చుకొంది. ప్రస్తుతం నిధి, పవన్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక గత కొన్నిరోజులు నుంచి నిధి పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో నిధి వివాహం జరగనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఈ జంట స్పందించింది లేదు, ఖండించింది లేదు. దీంతో కొద్దిలో కొద్దిగా అయినా ఈ వార్త నిజమే అని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ పుకార్లకు ఆజ్యం పోశాడు.. తమిళ్ హీరో ఉదయనిధి స్టాలిన్. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం కలగ తలైవన్ చిత్రంలో నిధి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉదయనిధి మాట్లాడుతూ ” నిధి ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. నాకన్నా ఎక్కువ ఈ చిత్రంలో ఆమెకే ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అందుకోసం నిధి ఎన్నో దెబ్బలు కూడా తిన్నది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇక ముందు ముందు నిధి తమిళ్ చిత్రాల్లో చేస్తుందో..? లేదో..? ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లి అయ్యాక నిధి ఏమైనా సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..? ఉదయనిధి ఎందుకు అలా అన్నాడు..? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
