NBK 111 : బాలయ్య – గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK111. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి మేకర్స్ పవర్ఫుల్ మాస్ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘GOD’ మరియు ‘DADA’ (దాదా) అనే రెండు మాస్ క్యాచీ టైటిల్స్ చిత్ర బృందం పరిశీలనలో ఉన్నాయి. బాలయ్య ఇమేజ్‌కి, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ డ్రామాకి ఈ రెండు పేర్లు పర్ఫెక్ట్గా సరిపోతాయని భావిస్తున్నారు. అయితే దాదాపు GOD టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం అంటున్నారు. ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్ స్టార్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య గాయపడడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ లేదా అక్టోబర్ స్టార్టింగ్ నుండి బాలయ్య తిరిగి సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు టైటిల్స్‌లో ఒకదాన్ని ఖరారు చేసి, చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఈఏడాది డిసెంబర్ 24న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!