Site icon NTV Telugu

నడిరోడ్డులో స్టార్ హీరోయిన్ పై దుండగుల దాడి.. తలపై కొట్టి

nikita dutta

nikita dutta

బాలీవుడ్ హీరోయిన్ నికితా దత్తా కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె రాత్రి నడుచుకొంటూ వెళ్తున్న సమయంలో ఆమెపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడిచేసి ఆమె ఫోను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని నికితా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో తెలిపింది. “నవంబర్ 19 న జరిగిన ఈ ఘటనను నేను జీవితంలో మర్చిపోలేను.. ఆరోజు రాత్రి 7.45 నిమిషాలకు నేను నడుచుకుంటు వెళుతున్నాను. నా వెనుక బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి నా తలపై కొట్టి నా చేతిలో ఉన్న ఫోన్‌ను లాగేసుకున్నారు. నేను స్పందించే లోగానే వారు పారిపోయారు” అని చెప్పుకొచ్చింది.

ఈ ఘటన అనంతరం నేను స్పృహ కోల్పోయాను.. తరువాత వెంటనే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసును ఫైల్ చేశాను. ఆసమయంలో వాకింగ్ చేతున్న మరో వ్యక్తి నాకు అండగా నిలబడ్డాడు. నాకులా మరొకరికి ఈ విధంగా జరగకూడదని ఈ విషయాన్నిమీకు చెప్తున్నాను.. తమ ప్రమేయం లేకుండా తాము కష్టపడినా సొమ్మును దొంగల పాలు చేయకండి.. జాగ్రత్తగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక అమ్మడి స్టోరీ విన్న నెటిజన్లు ప్రస్తుతం మీ ఆరోగ్యం జాగ్రత్త.. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి అని ఓదారుస్తున్నారు. ఇకపోతే నికితా కబీర్ సింగ్, బుల్ బుల్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకొంది.

Exit mobile version