Site icon NTV Telugu

ధనుష్‌ రికార్డ్ కి ఆమడ దూరంలో మహేశ్

ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి బర్త్ డే బ్లాస్టర్ విడుదలై రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టింది. ఇక పుట్టిన రోజున సినీ రాజకీయరంగ ప్రముఖుల శుభాకాంక్షలతో తడిచి ముద్దయ్యాడు మహేశ్. అదే రోజు సాయంత్ర ఏడు గంటలకు ట్విట్టర్ స్పేసెస్ లో లైవ్ సెక్షన్ నడిచింది. మహేశ్ టీమ్ నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో మహేశ్ తో పని చేసిన దర్శక, నిర్మాతలు , సాంకేతిక నిపుణులు పలువురు పాల్గొన్నారు. ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన ఈ ట్విటర్ స్పేస్ లైవ్ ను మహేశ్ టీమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా ధనుష్ రికార్డ్ పై కన్నేసింది. ఎందుకంటే గతంలో నిర్వహించిన ట్విటర్ స్పేస్ లైవ్ లో ధనుష్ దే రికార్డ్. దక్షిణాదిన 28 వేల వ్యూయర్స్ తో ధనుష్‌ ట్విటర్ స్పేస్ లైవ్ లో తొలి స్థానంలో ఉన్నాడు. ఇటీవల పుట్టిన రోజు సందర్భంగా ఈ రికార్డ్ సాధించారు ధనుష్‌ అభిమానులు. మహేశ్ లాగే ధనుష్ పుట్టిన రోజున కూడా తనతో పని చేసిన దర్శకులు, నటీనటులు ఆ లైవ్ లో పార్టిసిపేట్ చేశారు.

ఇక మహేశ్ లైవ్ విషయానికి వస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ట్విటర్ లైవ్ లో పాల్గొన్నారు. దాదాపు 14 వేల మంది ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేయటం విశేషం. టాలీవుడ్ కి సంబంధించి ట్విటర్ స్పేస్ లో ఇదే రికార్డ్. బర్త్ డే బ్లాస్టర్ 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ తో పాటు 754K లైక్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసినా… ట్విటర్ స్పేస్ లో మాత్రం ధనుష్ రికార్డ్ కి ఆమడ దూరంలోనే నిలిచారు మహేశ్. ధనుష్ లైవ్ స్పేస్ లో 28 వేల మంది పార్టిసిపేట్ చేయగా… మహేశ్ ట్విట్టర్ స్పేస్ లో మాత్రం 14 వేల మంది మాత్రమే పాల్గొన్నారు. మరి మనుముందు టాలీవుడ్ లో మహేశ్ రికార్డ్ ను, దక్షిణాదిలో ధనుస్ రికార్డ్ ను ఏ స్టార్ హీరో అభిమానులు బ్రేక్ చేస్తారో చూడాలి.

Exit mobile version