Site icon NTV Telugu

Kangana: పఠాన్ రిలీజ్ రోజునే కంగనా ట్విట్టర్ రీఎంట్రీ…

Kangana Sharukh Khan

Kangana Sharukh Khan

2021 మే నెలలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ని ట్విట్టర్ రూల్స్ ని వయొలెట్ చేసిన కారణంగా (Hateful Conduct and Abusive Behaviour Policy) ఆమెని ట్విట్టర్ నుంచి బాన్ చేశారు. కాంట్రవర్సీ స్పీచులు, హేట్ స్ప్రెడింగ్ కామెంట్స్ ఎక్కువగా చేసే కంగనా తనకి సంబంధం లేని విషయంలో కూడా దూరి మాట్లాడుతుందంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారు. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన కంగనా, ఇలా వివాదాల బాతి పట్టి కెరీర్ ని కష్టాల్లో పడేసుకుంది అనే వాళ్లు కూడా ఉన్నారు. స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ హీరోయిన్ ఇలా ఎవ్వరినైనా ఉద్దేశించి ట్వీట్స్ చెయ్యడంలో కంగనా దిట్ట, అందుకే ఆమె సోషల్ మీడియాలో బ్యాన్ అయ్యింది. సినీ అభిమానులు ప్రేమగా ‘క్వీన్’ అని పిలుచుకునే కంగనా ఎట్టకేలకు 19 నెలల తర్వాత ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చింది.

ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని చేపట్టిన తర్వాత కాంట్రవర్సీ సెలబ్రిటిలపై ఉన్న బాన్ ని లిఫ్ట్ చేస్తున్నాడు. అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ ట్రంప్ పై బాన్ లిఫ్ట్ చేసిన మస్క్, తాజగా కంగనా పైన కూడా బాన్ ఎత్తేసాడు. దీంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత కంగనా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. “Hello everyone, it’s nice to be back here” అంటూ కంగనా తన ఫస్ట్ ట్వీట్ ని పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన కంగనా ఫాన్స్ “వెల్కమ్ బ్యాక్ క్వీన్” అంటూ రిప్లై ఇస్తునారు. ఇదిలా ఉంటే కంగనా పై నిషేధం ఎత్తివేయడం వరకూ బాగానే ఉంది కానీ సరిగ్గా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ రిలీజ్ రోజునే కంగనా ట్విట్టర్ రీఎంట్రీ అందరికీ షాక్ ఇస్తుంది. పఠాన్ సినిమాపై రాబోయే రోజుల్లో కంగనా నుంచి నెగటివ్ ట్వీట్స్ చూసే ఛాన్స్ ఉందని షారుఖ్ ఫాన్స్ భావిస్తున్నారు.

Exit mobile version