బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టెలివిజన్ నటి ప్రియా మరాఠే (38) ఇకలేరు. ఈ వార్త వినగానే సినీ, టీవీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రియా, ముంబైలోని తన నివాసంలో ఈరోజు (ఆగస్టు 31) ఉదయం తుదిశ్వాస విడిచారు. 2006లో చిన్న తెరపై అడుగుపెట్టిన ప్రియా, ఇప్పటివరకు 20కి పైగా సీరియల్స్‌లో నటించారు. తన సహజమైన నటనతో టెలివిజన్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే విధంగా రెండు సినిమాల్లో కూడా నటించి తన ప్రతిభను చాటుకున్నారు.
Also Read : Komalee Prasad : అలాంటి సినిమాలో నటించాలనేది నా కోరిక..
క్యాన్సర్ మొదట తలెత్తినప్పుడు కొంతకాలం యాక్టింగ్‌కి దూరమై, తర్వాత ఆరోగ్యం మెరుగుపడటంతో తిరిగి పని ప్రారంభించారు. అయితే మళ్లీ వ్యాధి ముదరడంతో చికిత్స పొందుతూ చివరికి జీవన యాత్ర ముగించారు. 2012లో ఒక సీనియర్ నటుడు కుమారుడిని వివాహం చేసుకున్న ప్రియా, తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్న సమయంలోనే ఈ విషాదం జరగడం అందరినీ కలచివేసింది. ప్రియా మరాఠే మరణ వార్తతో బాలీవుడ్ టీవీ ప్రముఖులు, సహనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వ్యక్తం చేస్తున్నారు.
