NTV Telugu Site icon

Actress Injured: జిమ్‌లో జాగ్రత్త.. ప్రముఖ టీవీ నటికి తీవ్ర గాయం!

Krystle Dsouza Knee Injury

Krystle Dsouza Knee Injury

TV Actress Krystle Dsouza Knee Injury In Gym: ఈ మధ్య కాలంలో చాలా మందిలో హెల్త్ కాన్షియస్ పెరిగింది. అందుకే ఎక్కువగా వ్యాయామం చేసేందుకు జిమ్ బాట పడుతున్నారు. అయితే జిమ్ లో వ్యాయామం చేసేటప్పుడు జిమ్ ట్రైనర్ ఖచ్చితంగా ఉండాలి. వారు లేకుండా చేస్తే గాయాల పాలు కావడం తప్పదు. తాజాగా అలాగే ఒక నటి గాయాల పాలు అయినట్టు స్వయంగా వెల్లడించింది. హిందీ బుల్లితెర మీద ‘ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై’ వంటి ప్రముఖ సీరియల్స్‌లో కనిపించిన క్రిస్టల్ డిసౌజాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తుండగా క్రిస్టల్ డిసౌజా గాయపడింది. మోకాలిలో విపరీతమైన నొప్పి రావడంతో వెంటనే క్లినిక్‌కి వెళ్లి అక్కడ నుంచి ఆమె తన ఫొటోలను షేర్ చేసి హెల్త్ అప్‌డేట్ ఇవ్వడంతో వైరల్ అవుతోంది. 2007లో ‘కహెన్ నా కహెన్’ సినిమాతో నటనా రంగంలోకి అడుగుపెట్టిన క్రిస్టిల్ డిసౌజాకి ఏప్రిల్ 20న ఈ గాయం అయినట్టు తెలుస్తోంది.

Salman Khan House Firing : నదిలో దూకి క్రైం బ్రాంచ్‌ సెర్చ్ ఆపరేషన్

రోజూ లాగే శనివారం కూడా వర్కవుట్ చేయడానికి జిమ్‌కి వెళ్లింది. అకస్మాత్తుగా ఆమెకు మోకాళ్ల దగ్గర ఇబ్బంది అనిపించింది, తరువాత, తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. ఇక ఈ క్రమంలో క్రిస్టల్ టైమ్స్ నౌ ఇండియాతో మాట్లాడుతూ, ‘జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు నా మోకాలికి గాయమైంది.’ ఇక వెంటనే వైద్యం కోసం క్లినిక్‌కి తీసుకెళ్లారు అని పేర్కొంది. ఇక ఇప్పుడు ఆమె కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటికే కొంత ఉపశమనం లభించిందని ఆమె తెలిపారు. అయితే తనకు మందులు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు కానీ ఈ సమయంలో తినక తప్పడం లేదని ఆమె షేర్ చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చింది. క్రిస్టల్ ‘ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై’ సీరియల్‌లో జీవికా వధేరా అనే పాత్రను పోషించడం ద్వారా గుర్తింపు పొందింది. ఇది కాకుండా, ఆమె ‘ఏక్ నయీ పెహచాన్’, ‘బెలన్ వాలీ బహు’ వంటి సీరియల్స్ లో కూడా కనిపించింది.

Show comments