బాలీవుడ్ లో విడాకులు కొత్తకాదు. ఇష్టపడినప్పుడు పెళ్లి చేసుకోవడం, వద్దు అనుకున్నప్పుడు విడాకులు తీసుకోవడం బాలీవుడ్ లో నిత్యం జరిగేవే.. విడాకుల కోసం ఒకరి మీద ఒకరు ఎన్నో ఆరోపణలు చేసుకుంటారు. తాజాగా టీవీ నటుడు కరణ్ మెహ్రా తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. టీవీ నటి నిషా రావల్, కరణ్ మెహ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. దీంతో ఈ జంట గతేడాది కోర్టులో విడాకుల కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరణ్ మెహ్రా , భార్య నిషా పై సంచలన ఆరోపణలు చేశాడు.
” నిషా కావాలనే ఇదంతా చేస్తోంది. తనను తాను గాయపర్చుకొని నా మీద నిందలు వేస్తోంది. నా దగ్గరనుంచి భారీ భరణం కోసం ఆమె ఎంతకైనా తెగిస్తోంది. 11 నెలల నుంచి నా ఇంట్లో మరొకతను ఉంటున్నాడు. నా కళ్ళముందే అతడు నా భార్యతో కాపురం చేస్తున్నాడు. నన్ను, నా పిల్లలను వదిలి నిషా వివాహేతర సంబంధం పెట్టుకుంది. నన్ను బెదిరించి నా ఆస్తులు, నా కార్లు లాక్కున్నారు. నిషాకు సన్నిహితులైన రోహిత్ వర్మ, మునీషా ఖట్వా ఇప్పుడు తనతో ఎందుకు లేరు” అంటూ మీడియా ముందు వాపోయాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే భరణం గురించి అంతకుముందు నిషా మాట్లాడుతూ ” తన దగ్గరనుంచి నాకు ఒక్కరూపాయి కూడా వద్దు. ఇద్దరం కష్టపడి సంపాదించుకున్న దాన్ని మళ్లీ నేనే ఎందుకు కావాలని అడుగుతాను. చిన్నతనం నుంచి నాకు నేనుగ ఎదిగాను. అతడి డబ్బు నాకు అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈసారి ఈ వ్యాఖ్యలపై నిషా ఎలా స్పందిస్తుందో చూడాలి.