2018లో విడుదలైన మరాఠీ హారర్ మాస్టర్‌పీస్ “తుంబాడ్” ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని అలరిస్తూ హిట్ అయ్యింది. మైథాలజీ, ఫాంటసీ, హారర్ అంశాలను సరిగ్గా మిక్స్ చేసి, సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. సోహుమ్‌షా ప్రధాన పాత్రలో నటించి, రాహి అనిల్ బార్వీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇప్పుడు సీక్వెల్ రూపంలో రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌స్టూడియోస్ భాగస్వామ్యంతో, సోహుమ్‌షా తనకంటూ కొత్త వెర్షన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించబోతున్నారు. 2026 లో ప్రారంభం కానున్న ఈ సీక్వెల్ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను కలిగిస్తోంది.
Also Read : Sreeleela : శ్రీలీల vs భాగ్యశ్రీ.. లీడ్ రోల్ కోసం హాట్ రేస్..
మునుపటి కథకు కొత్త ట్విస్టులు, సస్పెన్స్, అద్భుతమైన విజువల్స్ తో మేకర్స్ ప్రేక్షకుల్ని మరోసారి థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కొత్త సీన్‌లు, ఎఫెక్ట్స్, క్యారెక్టర్లు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అభిమానులు ఇప్పటికే కొత్త సినిమా కోసం క్రేజీగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఒక హాట్ రూమర్: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ సీక్వెల్‌లో కీలక పాత్రలో ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన రానప్పటికి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో క్రేజీగా పోస్టులు, మేమ్‌లు షేర్ చేస్తూ ఉత్సహాని పెంచుకుంటున్నారు. హారర్ ఫ్యాన్స్ కోసం ఇది నిజంగా హైలైట్‌గా మారే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు.
