NTV Telugu Site icon

Trivikram: ఎట్టకేలకు గుంటూరు కారం హడావుడి తరువాత దర్శనమిచ్చిన గురూజీ

Trivikram With Chiranjeevi

Trivikram With Chiranjeevi

Trivikram’s first appearance post Guntur Kaaram Release: గుంటూరు కారం రిలీజ్‌ తర్వాత త్రివిక్రమ్ ఎందుకు కనిపించలేదు? గురూజీపై ట్రోలింగ్‌… అందుకే బైటకు రాలేకపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఎట్టకేలకు బయట కనిపించారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో ఆయన నివాసానికి నిర్మాత చినబాబుతో వెళ్లి త్రివిక్రమ్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. నిజానికి గుంటూరు కారం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎందుకో అంతా సాఫీగా సాగలేదు. ముందుగా కథలో మార్పులు చేయాల్సి వచ్చింది, ఆ తరువాత ఎప్పటికప్పుడు షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఈ లోపు పవన్‌ సినిమా కెరీర్‌పై త్రివిక్రమ్‌ కాన్సన్‌ట్రేషన్‌ చేస్తున్నాడని, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌..హరిహర వీరమల్లు వాయిదాకు త్రివిక్రమే కారణం? అని కూడా ప్రచారం జరిగింది. ఆయా సినిమాలు చేయాల్సిన సమయంలోనే వీటి ప్లేస్‌లో ‘భీమ్లానాయక్‌’, ‘బ్రో’ త్రివిక్రమ్‌ తీసుకొచ్చినట్టు సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Chiranjeevi: ఈ ఇద్దరు డైరెక్టర్స్ తో ఒక్క సినిమా పడినా.. బాక్సాఫీస్ షేప్ మారిపోతుంది మావా..

త్రివిక్రమ్‌ పర్యవేక్షణలో భీమ్లా నాయక్‌.. బ్రో సినిమాలు తెరకెక్కాయి. భీమ్లా నాయక్‌, బ్రోకు త్రివిక్రమ్‌ మాటలు కూడా అందించగా తన సొంత బేనర్‌లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ గుంటూరుకారంపై దృష్టి పెట్ట లేదని విమర్శలు వచ్చాయి. అయితే నిజానికి ఎందుకో గుంటూరు కారం సినిమాకి ముందే డిజాస్టర్‌ టాక్‌ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి పాజిటిక్‌ టాక్‌ వచ్చింది. అలా చివరిగా కొద్దిరోజుల క్రితం యూనిట్ చెప్పిన దాని ప్రకారం 110 కోట్ల షేర్‌.. 230 కోట్ల షేర్‌ కలెక్ట్ చేసింది. సినిమా ఓకే అనిపించుకున్నా గురూజీ మాత్రం బైటకు రాలేదు. మహేష్ సక్సెస్ పార్టీ ఇచ్చినా కనపడలేదు, ఆయన లేడని సక్సెస్ పార్టీ కూడా క్యాన్సిల్ అయింది. ఇక ఈ సినిమాకి రిలీజ్ కి ముందు ఎలాంటి ప్రమోషన్స్ లేవు, రిలీజ్‌ తర్వాత ప్రమోషన్స్ లేవు. దీంతో సినిమాలో రమణగాడు అమ్మ ప్రేమకు నోచుకోలేదో సినిమాకి ప్రమోషన్‌స్ కూడా ఆ స్థాయిలో నోచుకోలేదని మహేష్ అభిమానులు భావించారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు గురూజీ బయట కనిపించారు.