NTV Telugu Site icon

Ramayan : రణబీర్ రామాయణం మొదలైంది.. రంగంలోకి గురూజీ!

Ranbir Sai Pallavi

Ranbir Sai Pallavi

Trivikram to Write Telugu Version Dialouges to Ranbir Kapoor Ramayan: బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణ అనే ఒక రామాయణ గాధ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. నిన్నటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షూటింగ్ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. ఆకృతి సింగ్ అనే ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ స్టోరీలో ఆమె ఈ ఫోటోలను షేర్ చేసింది.

Pawan Kalyan :అస్వస్థతకు లోనయ్యా.. ఆరోగ్య పరిస్థితిపై పవన్ ట్వీట్

ఆమె ఈ సినిమా టీంలో పని చేస్తుందని ప్రచారం జరుగుతుంది. సెట్స్ తో ఉన్న ఒక ఫోటో షేర్ చేసి రామాయణ డే వన్ అంటూ ఆమె పేర్కొంది. అయితే ఫోటోలో ఎక్కడ పూర్తిస్థాయిలో సెట్ రివీల్ చేయలేదు. సెట్స్ వెనకవైపు నుంచి ఫోటో తీసి ఆమె షేర్ చేసింది. ప్రస్తుతానికి రణబీర్ కపూర్ షూటింగ్లో పాల్గొనడం లేదు, త్వరలోనే ఆయన పాల్గొంటారు అని అంటున్నారు. నిన్న చిన్నపాటి పూజా కార్యక్రమం చేసి సినిమా యూనిట్ షూట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే త్రివిక్రమ్ తెలుగు వెర్షన్ మాటలు అందించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన మార్క్ మాటలతో త్రివిక్రమ్ అలరించబోతున్నాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కేజీఎఫ్ యష్ రావణాసురుడు పాత్రలో కనిపించబోతున్నాడు అనే ప్రచారం కూడా ఉంది. కానీ ఆ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Show comments