NTV Telugu Site icon

Trivikram: గురూజీకి ఈ హీరో కలిస్తే ఇంపాక్ట్ మాములుగా ఉండదు…

Trivikram

Trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని ఫేస్ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత గురూజీపైన విమర్శలు రావడం ఇదే మొదటిసారి. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో త్రివిక్రమ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు కానీ ఈసారి మాత్రం మహేష్ ఒక్కడే గుంటూరు కారం సినిమా వెయిట్ ని మోయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటికే అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసాడు త్రివిక్రమ్. ఇప్పటికే మూడు సినిమాలు చేసి హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ నాలుగోసారి ఎలాంటి సినిమాతో వస్తారో అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపు త్రివిక్రమ్ ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ అల్లు అర్జున్ సినిమా కన్నా ముందు త్రివిక్రమ్ మాస్ మహారాజ రవితేజతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన తెరకెక్కనున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఫైనల్ అయ్యిందని సమాచారం. త్రివిక్రమ్ డైలాగ్స్ కి రవితేజ డైలాగ్ డెలివరీ తోడైతే స్క్రీన్ పైన మ్యాజిక్ చూడడం గ్యారెంటీ. సినిమాలో డైలాగ్స్ పర్ఫెక్ట్ గా పేలుతాయి కాబట్టి రవితేజ-త్రివిక్రమ్ కాంబినేషన్ చూడడానికి బాగుంటుంది. రవితేజ త్వరగా సినిమాలు చేసేస్తాడు కాబట్టి ఈ మూవీ కూడా స్టార్ట్ చేస్తే ఫాస్ట్ గానే కంప్లీట్ అవ్వడం గ్యారెంటీ. అయితే ఈ కలయిక అసలు నిజమా? ఒకవేళ నిజమైతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ అవుతుంది అనేది చూడాలి.