Trivikram Comments on allu arjun National Award: 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా తెలుగు సినిమా పతాకం ఎగురుతోంది అని అంటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్ గురించి కీలకమైన కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ జాతీయ అవార్డును కైవసం చేసుకుని, ఈ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా తన స్థానాన్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ గారి అద్భుతమైన విజయాన్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోలేదని చెప్పుకొచ్చారు. ఆయన సినిమాల్లో చేసే పాత్రల కోసం ఆయన ఎంత కష్ట పడతాడో దగ్గరి నుంచి అంకితభావం, అభిరుచి గమనించిన నాకు ఆ అవార్డు ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు. సినిమా మీద ఆయనకు ఉన్న నిబద్ధతను గుర్తించే మరిన్ని అవార్డులు భవిష్యత్తులో లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని త్రివిక్రమ్ అన్నారు. ఇక కొన్నేళ్లుగా కమర్షియల్ సినిమా పాటలు అంటే ఇలానే ఉండాలని అర్ధం చెప్పిన MM కీరవాణి వంటి దిగ్గజ స్వరకర్త RRR వంటి మెమరబుల్ మూవీ కోసం ఆస్కార్ సహా జాతీయ అవార్డును గెలుచుకున్నారు, మీకు అభినందనలు సార్.
Balakrishna: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు.. నాకు చాలా గర్వంగా ఉంది!
ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ అవార్డు పొందిన కాల భైరవ, శ్రీనివాస్ మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలమన్‌లకు అభినందనలు అని రాసుకొచ్చారు. ముఖ్యంగా, నేను SSకి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే గ్లోబల్, నేషనల్ స్టేజ్‌లలో మన తెలుగు సినిమాకు ఇంతటి అఖండ కీర్తిని తీసుకొచ్చారని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ఇక తమ తొలి చిత్రం ఉప్పెనతో జాతీయ అవార్డును గెలుచుకున్న బుచ్చిబాబు సన, మరియు పంజా వైష్ణవ్ తేజ్‌లకు నా శుభాకాంక్షలు అని రాసుకొచ్చిం ఆయన నేను ఎంతో ఆరాధించే మరియు గౌరవించే గీత రచయిత చంద్రబోస్ కు నా శుభాకాంక్షలు. అలాగే నా సోదరుడు, ఎనర్జిటిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం అని అంటూ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్పుకొచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
