NTV Telugu Site icon

Trisha: 25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన త్రిష

Trisha

Trisha

Trisha’s Legal Action Against Politician AV Raju: ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష మీద నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువకముందే ఆమె మీద తమిళనాడుకు చెందిన ఒక పొలిటీషియన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిజానికి మన్సూర్ అలీ ఖాన్ త్రిష మీద చేసిన వ్యాఖ్యల సమయంలో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ముందు మన్సూర్ అలీ ఖాన్ తాను తప్పు ఏమీ మాట్లాడలేదు అని చెప్పినా చివరికి బాధపడ్డారు కాబట్టి ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ విషయం మీద రివర్స్లో మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా వేసి కోర్టు చేత చివాట్లు కూడా తిన్నాడు. ఆ అంశం ఇంకా మరుగున పడకముందే ఇప్పుడు త్రిష మీద తమిళనాడుకు చెందిన ఏవీ రాజు అనే ఒక పొలిటిషియన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పాతిక లక్షల కోసం త్రిష ఒక పొలిటిషియన్ తో గడిపిందని ఆయన ఆరోపించారు.

Deepika Padukone : తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఈ అంశం కలకలం రేపుతున్న నేపథ్యంలో త్రిష తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కొంతమంది అల్పులు, వేరే వాళ్ల జీవితాలను ఆధారంగా చేసుకుని బతికే వాళ్ళు అటెన్షన్ కోసం ఎంత దారుణానికైనా దిగజారుతారనే విషయం తెలిసి చాలా బాధ కలుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాను. ఈ విషయంలో నేను చెప్పాల్సిందేమీ లేదు ఎందుకంటే ఇక మీదట నా లీగల్ టీం ఈ విషయం మీద ముందుకు వెళుతుంది అంటూ ఆమె పేర్కొన్నారు. ఆమె ఏ విషయం మీద స్పందించాను అనేది క్లారిటీ ఇవ్వకపోయినా నిన్ననే ఏవీ రాజు త్రిష గురించి వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యాఖ్యల గురించే త్రిష స్పందించిందని భావిస్తున్నారు. ఆమెకు మద్దతుగా కూడా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Show comments