Site icon NTV Telugu

Trimukha: జనవరిలో ప్రేక్షకుల ముందుకు ” త్రిముఖ”

Trimuka

Trimuka

మొదటి సినిమాతోనే యోగేష్ అనే కుర్రాడు పాన్ ఇండియన్ ఫిల్మ్ “త్రిముఖ”తో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ సినిమాలో నాజర్, సిఐడి ఆదిత్య శ్రీవాస్తవ్, సన్నీ లియోన్, మొట్టా రాజేంద్రన్, ప్రవీణ్, అషు రెడ్డి సహా ఇతరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. త్రిముఖ షూటింగ్ పూర్తి చేసుకుని జనవరి 2025లో విడుదల చేయాలని భావిస్తున్నారు. యోగేష్ మొదటి సినిమా కూడా అవకుండానే మరో రెండు సినిమాలు సైన్ చేసాడు.

“చాణుక్యం”, “బెజవాడ బాయ్స్” కూడా చేస్తుండగా చాణుక్యం సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. బెజవాడ బాయ్స్ సినిమా జనవరి, 2025లో పొంగల్ తర్వాత షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాణుక్యం సినిమాలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మొట్టా రాజేంద్రన్, సుమన్, వినోద్ కుమార్, ధన్య బాలకృష్ణ, శ్రవణ్, నాగ మహేష్, ప్రభాకర్ వంటి వారు నటిస్తున్నారు. ఇక బెజవాడ బాయ్స్‌లో చాలా మంది ప్రముఖ నటులు భాగం కానున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version