NTV Telugu Site icon

K Vishwanath: కళాతపస్వి విశ్వనాథ్ బయోపిక్..?

Viswadarshanam

Viswadarshanam

K Vishwanath: మహానటి సావిత్రి బయోపిక్ తరువాత బయోపిక్ ల ట్రెండ్ మరింత జోరు పెంచింది. సినీ, రాజకీయ రంగాల్లో ప్రజలకు మంచి చేసిన, ప్రజలకు స్ఫూర్తినింపిన వారి జీవిత కథలను అందరి ముందుకు తీసుకువస్తున్నారు దర్శకులు. ఇక సావిత్రి బయోపిక్ రిలీజ్ అయినా కొద్దిరోజులకే కళాతపస్వి విశ్వనాథ్ బయోపిక్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘విశ్వ దర్శనం’ టైటిల్ తో జనార్ధన మహర్షి ఈ బయోపిక్ ను ప్రారంభించారు. 2018 లో మొదలైన ఈ సినిమా ఇప్పటివరకు బయటికి వచ్చింది లేదు. అయి బయోపిక్ అర్దాంతరంగా ఆగిపోవడానికి కారణం ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పుకొస్తున్నారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా చూపించి ఎన్టీఆర్ బయోపిక్ తీశారని క్రిష్- బాలకృష్ణ ను ఏకిపారేశారు అభిమానులు. ఇక ఈ విమర్శలకు తట్టుకోలేకనే వారు బయోపిక్ ను మధ్యలోనే ఆపేసినట్లు వార్తలు వినిపించాయి. దాదాపు మూడేళ్ళ తరువాత నేడు మరోసారి కళాతపస్వి విశ్వనాథ్ బయోపిక్ హాట్ టాపిక్ గా మారింది.

K Vishwanath: ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు

గతరాత్రి కళాతపస్వి విశ్వనాథ్ మృతిచెందిన విషయం తెల్సిందే. గత కొంత కాలంగా వయవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అపోలోలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఇప్పుడు ఆయన బయోపిక్ ను తీసే దమ్మున్న డైరెక్టర్ ఎవరు అని చర్చ మొదలయ్యింది. ఒకరకంగా చెప్పుకోవాలంటే.. విశ్వదర్శనం పూర్తీ అయ్యి ఉంటే.. తన జీవిత కథను చూసుకొని ఉండేవారు విశ్వనాథ్. ఇప్పుడు ఆ అదృష్టం లేకుండా పోయింది. ఆయన జీవితంలో ఒడిదుడుకులు ఎన్నో.. అంతకుమించిన విజయాలు.. జీవిత సత్యాలు, చాలామందికి గుణపాఠాలు.. ఇలా చెప్పుకొంటూ పోతే విశ్వనాథ్ జీవితమే ఒక పెద్ద పుస్తకం. అందులో అన్ని పేజీలను కాకపోయినా మర్చిపోలేని కొన్ని పేజీలను అయినా ఈ బయోపిక్ లో పెట్టి.. వచ్చే తరానికి బహుమతిగా ఇస్తారని చాలామంది ఆశపడుతున్నారు. మరి కళాతపస్వి విశ్వనాథ్ బయోపిక్ మళ్లీ మొదలుపెడతారా..? ఈసారి ఆ డైరెక్టర్ ఎవరు..? అనేది తెలియాల్సి ఉంది.