Toxic Update : ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన నటుడు యష్. ఇప్పుడు అతను చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, గ్లోబల్ లెవెల్‌లో కూడా భారీ అంచనాలతో మందుకు కదులుతోంది. అయితే ఇలాంటి సమయంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో కలిసి చేస్తున్న ‘టాక్సిక్’ ప్రాజెక్ట్‌పై గత కొన్ని నెలలుగా వరుస రూమర్స్ వినిపించడంతో అభిమానుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది? యూనిట్‌లో నిజంగానే విభేదాలు ఉన్నాయా? యష్ స్వయంగా పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకున్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రచారాలన్నింటికీ చెక్ పెడుతూ ‘టాక్సిక్’ మళ్లీ వార్తల్లో నిలిచింది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘టాక్సిక్’ టీమ్ వచ్చే వారం అభిమానులకు ఒక కీలకమైన అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. చాలా రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు మేకర్స్ స్వయంగా ముందుకు వచ్చి ఒక ప్రకటన ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రకటనతో సినిమాపై మళ్లీ భారీ బజ్ క్రియేట్ చేయాలనే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ‘టాక్సిక్’ యష్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా భావిస్తున్నారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత యష్ చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటున్నారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ మినహా మరే కొత్త ప్రాజెక్ట్‌ను ఆయన ప్రకటించకపోవడం కూడా ‘టాక్సిక్’పై ఆయన ఎంత ప్రత్యేక దృష్టి పెట్టారో తెలియజేస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ సినిమా కోసమే సమయం కేటాయించిన యష్, క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది.
ఇటీవల సినిమా రెండుసార్లు వాయిదా పడిందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, కథలో మార్పులు జరుగుతున్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను యష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాలపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు సినిమా మళ్లీ గాడిలో పడిందనే సంకేతాలు రావడంతో ఆ ప్రచారాలకు కూడా ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం విడుదలయ్యే అప్‌డేట్‌లో కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వరుస వాయిదాల కారణంగా కొంత తగ్గిన హైప్‌ను తిరిగి పాన్ ఇండియా స్థాయిలో, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బలంగా తీసుకెళ్లడం ఇప్పుడు చిత్రబృందానికి పెద్ద సవాల్‌గా మారింది. అయితే యష్ క్రేజ్, గీతూ మోహన్ దాస్ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్, సినిమా కాన్సెప్ట్‌పై ఇప్పటికే ఉన్న ఆసక్తి దృష్ట్యా ఒక బలమైన అప్‌డేట్ వస్తే ‘టాక్సిక్’ మళ్లీ సోషల్ మీడియా ట్రెండ్స్‌ను శాసించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అభిమానులందరి చూపు వచ్చే వారంపైనే ఉంది.

