దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా RRR మేనియా కొనసాగుతోంది. దర్శక దిగ్గజం ట్యాలెంటెడ్ కు భారతీయ సినీ పరిశ్రమ మొత్తం సలాము చేస్తోంది. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ప్లాప్ లేని మన జక్కన్న ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుల జాబితాలో ముందు వరుసలో చేరిపోయారు. RRR మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా టాప్ స్టార్స్ ను సైతం ఫిదా చేసేసింది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్టీఆర్, చరణ్ లతో పాటు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విజువల్ వండర్ తో ప్రేక్షకుల అంచనాలను మొదటి షోతోనే రీచ్ అయ్యాడు జక్కన్న. ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరైన విజనరీ డైరెక్టర్ శంకర్ ‘మహారాజ’ అంటూ రాజమౌళిని అభివర్ణించడం విశేషం. ఇక సోషల్ మీడియా వేదికగా ఎవరెవరు ఎలా స్పందించారో చూద్దాం.
Read Also : Director Shankar : హ్యాట్సాఫ్ ‘మహారాజ’మౌళి
