NTV Telugu Site icon

Tom Cruise: సినిమా చూడమని చెప్పడానికి విమానం నుంచి దూకేసాడు…

Tom Cruise

Tom Cruise

టామ్ క్రూజ్ ఈ పేరు వినగానే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డూపు లేకుండా చేసే హీరో గుర్తొస్తాడు. రస్కీ స్టంట్స్ ని కూడా అవలీలగా చేసే హీరో కనిపిస్తాడు. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో టామ్ క్రూజ్ రేంజులో యాక్షన్ సినిమాలు చేసే హీరో మరొకరు లేరంటే అతని స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్’తో వరల్డ్ ఆడియన్స్ ని దగ్గరైన టామ్ క్రూజ్, ఇటివలే నటించిన సినిమా ‘టాప్ గన్ మెవరిక్’. 1986లో వచ్చిన ‘టాప్ గన్’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో టామ్ క్రూజ్, ‘నావెల్ ఏవియేటర్’గా కనిపించాడు.

170 మిలియన్ డాలర్స్ లో రూపొందిన ‘టాప్ గన్ మెవరిక్’ మూవీ ఈ ఏడాది మే 27న ప్రపంచ సినీ అభిమానుల ముందుకి వచ్చింది. బ్లాక్ బస్టర్ రివ్యూస్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఓవరాల్ థియేటర్ రన్ లో 1.48 బిలియన్ డాలర్స్ రాబట్టింది. 2022లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘టాప్ గన్ మెవరిక్’ చరిత్ర సృష్టించింది. ఈ మూవీని డిసెంబర్ 22న ‘పారామౌంట్+’లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి ఒక వీడియో రిలీజ్ చేసిన ‘టామ్ క్రూజ్’, థియేటర్స్ లో ‘టాప్ గన్ మెవరిక్’ సినిమాని ఆదరించిన వారికి థాంక్స్ చెప్తూ… గాల్లో ఉన్న ఫ్లైట్ నుంచి అమాంతం కిందకి దూకేసాడు. సినిమాల్లో స్టంట్స్ అంటే సరేలే కానీ అనౌన్స్మెంట్ వీడియోలో కూడా ఇలా విమానం నుంచి దూకేయాలా అంటూ సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Show comments