NTV Telugu Site icon

Bhagavanth Kesari Trailer: బాలయ్య కోసం కదిలొస్తున్న మాస్ డైరెక్టర్స్…

Bhagavanth Kesari

Bhagavanth Kesari

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఎప్పుడూ తెల్ల బట్టలు వేసి ఫ్యాక్షన్ సినిమాలు చేసే బాలకృష్ణని అనిల్ రావిపూడి తెలంగాణలోకి దించాడు. ఈరోజు వరంగల్ లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వరంగల్ లో జరగనుంది. రాత్రి 8:16 నిమిషాలకి భగవంత్ కేసరి ట్రైలర్ బయటకి రానుంది. గ్రాండ్ గా జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బాలయ్య కోసం మాస్ డైరెక్టర్స్ రంగంలోకి దిగారు. 2023 సంక్రాంతికి బాలయ్యతో వీర సింహా రెడ్డి సినిమా చేసి బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని, బాలయ్యతో నెక్స్ట్ సినిమా చేయబోతున్న దర్శకుడు బాబీ, వంశీ పైడిపల్లి… భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వస్తున్నారు.

ప్రొడ్యూసర్స్ ఈ గెస్ట్ లిస్ట్ అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తూ నందమూరి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. గోపీచంద్ మలినేని బాలయ్యకి ఇచ్చే ఎలివేషన్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని, బాబీ రావడానికి కారణాలు ఉన్నాయి కానీ వంశీ పైడిపల్లి భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఎందుకు వస్తున్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు. జనరల్ గా వస్తున్నాడా లేక బాలయ్యతో నెక్స్ట్ సినిమాని వంశీ పైడిపల్లి ప్లాన్ చేస్తున్నాడా అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకవేళ వంశీ పైడిపల్లి బాలయ్య కాంబినేషన్ లో సినిమా ఉంటే ఈరోజే ఆ విషయంలో ఒక క్లారిటీ రానుంది.