Site icon NTV Telugu

Marudhuri Raja: ప్రముఖ టాలీవుడ్ రచయిత ఇంట తీవ్ర విషాదం

Marudhuri Raja Son Died

Marudhuri Raja Son Died

Marudhuri Raja son Died: తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 200 సినిమాలకు రైటర్ గా పనిచేసిన మరుధూరి రాజా మొదటి సినిమా ‘ఒంటరి పోరాటం’ నుంచి రైటర్ గా మంచి క్రేజ్ సంపాదించారు. ఈవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, కే రాఘవేంద్రరావు వంటి దర్శకులకు సినిమాలకు ఆయన ఎక్కువగా పని చేశారు. నిజానికి ఆయన దర్శకత్వం వహించిన శ్రమదేవోభవ అనే నాటకం రవీంద్రభారతిలో చూసిన జంధ్యాల ఆయనను మద్రాసుకు రమ్మని ఆహ్వానించారు. అలా మద్రాసు వెళ్లిన రాజా జంధ్యాల దగ్గర శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, రావూ గోపాలరావు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రజాస్వామ్యం సినిమాకు సంభాషణల రచయితలుగా పనిచేస్తున్న పరుచూరి బ్రదర్స్ దగ్గర సహాయకుడిగా చేరి అదే బ్యానర్ లోని తరువాతి నవభారతం సినిమాతో సంభాషణల రచయితగా మారాడు.

NTR fan Shyam Death: శ్యాం మరణం పై అనుమానాలు ఉన్నాయి.. విచారణ జరపమని శ్యాం తండ్రి లేఖ!

ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పోకూరి బాబూరావు, కే రాఘవేంద్రరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జి. నాగేశ్వరరెడ్డి లాంటి దర్శకులతో సుమారు 200 సినిమాలకు సంభాషణలు రాసే అవకాశం దక్కింది. ఈ మధ్యలో కూడా ఆయన అతనొక్కడే, బండ్ల గణేష్ డేగల బాబ్జీ, సంతోష్ శోభన్ హీరోగా సంక్రాంతి బరిలోకి దిగిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాలకు కూడా డైలాగ్స్ అందించారు. అయితే అసలు విషయం ఏమంటే ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు. ‘’మొన్న 26వ తేదీ సోమవారం ఉదయం తొమ్మిదిగంటలకు.. (జాండిస్.,డెంగ్యూ.. 20 రోజులు ఇబ్బంది పెట్టడంతో) దేవుని పిలుపుతో పెద్దవాడు దూరంగా వెళ్లి పోయాడు..!!, ఆ రోజు.. ఏమీ అర్థం కాని, ఏదో తెలియని అయోమయ స్థితిలో వెంటనే తెలియపరచ లేక పోయాను, నాలోకి నేను వచ్చే టైమ్ తీసుకుని కలుస్తాను.. ప్రస్తుతానికి ఇదే చెప్పగలను అంటూ తన కుమారుడితో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశారు.

Exit mobile version