NTV Telugu Site icon

Neelima Guna: ఘనంగా జరిగిన నీలిమ గుణ వెడ్డింగ్ రిసెప్షన్… హాజరైన టాలీవుడ్ ప్రముఖులు

Neelima Guna

Neelima Guna

సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు ‘నీలిమ గుణ’, ‘రవి’ల ఇవాహం ఇటివలే గ్రాండ్ గా జరిగింది. ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ సినీ ప్రముఖులు విచ్చేసి ‘నీలిమ’, ‘రవి’లని ఆశీర్వదించారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లు అర్హా, రాజమౌళి, రమా రాజమౌళి, శేఖర్ కమ్ముల, మెహర్ రమేష్, మణిశర్మ, బెల్లంకొండ సురేష్ కుటుంబం తదితరులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి విచ్చేసారు.

ఇక సినిమాల విషయానికి వస్తే గుణశేఖర్ ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సమంతా టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘శాకుంతలం’ సినిమా కోసం సమంతా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాని ఆడియన్స్ ముందుకి ఎప్పుడు తెస్తాడో చూడాలి.