Site icon NTV Telugu

Adiseshagiri Rao: రెండు రోజులాగండి, తగ్గాకే వెళ్ళండి.. టికెట్ రేట్లపై టాలీవుడ్ నిర్మాత సంచలనం

Ticket rates

Ticket rates

విజయవాడ నగరం నడిబొడ్డున లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం కొలువుదీరనుంది. ఈ
విగ్రహ ఆవిష్కరణ వివరాలతో పాటు, ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సినిమా టికెట్ ధరల పెంపుపై ఆదిశేషగిరిరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు మరియు ప్రేక్షకుల కోణంలో ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెద్ద సినిమాల బడ్జెట్ పెరిగిందన్న సాకుతో టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. “పెద్ద సినిమాల రేట్లు విపరీతంగా పెంచడం వల్ల చిన్న సినిమాలు మనుగడ కోల్పోతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం.”

ALso Read:Krishna: బెజవాడ నడిబొడ్డున కృష్ణ విగ్రహం..ఆవిష్కరించనున్న కొత్త ఘట్టమనేని హీరో

ధరల భారం నుంచి తప్పించుకోవడానికి ప్రేక్షకులకు ఆయన ఒక లాజిక్ చెప్పారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులే భారీ ధరలు ఉంటాయి, ఆ మూడు రోజుల బిజినెస్ అయిపోగానే రేట్లు తగ్గుతాయి. టికెట్ ధరలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో, అప్పుడే థియేటర్లకు వెళ్లాలని ఆయన సూచించారు. అలాగే సినిమా ప్రొడక్షన్ ఖర్చులు నియంత్రణలో ఉంటేనే, టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

Exit mobile version