NTV Telugu Site icon

Tollywood Throwback: ఈ ఫొటోలో ఇద్దరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, ఒక తమిళ్ స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో గుర్తుపట్టారా?

Hanumanjunction Working Still

Hanumanjunction Working Still

Tollywood Throwback Photo from Hanuman Junction Sets Goes viral in Social Media: తెలుగు ఆడియన్స్ కి హనుమాన్ జంక్షన్ సినిమా దాదాపు గుర్తుండే ఉంటుంది. 2001 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో జగపతిబాబు అర్జున్ సర్జా హీరోలుగా నటించారు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో ప్రసారం అవుతూనే ఉంటుంది. ప్రసారమైన సమయంలో కామెడీ కోసమో సెంటిమెంట్ కోసమో ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. మొన్న గాడ్ ఫాదర్ లాంటి సినిమాని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా ఈ సినిమాని ఆ రోజుల్లోనే డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వర్కింగ్ స్టైల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వర్కింగ్ స్టిల్ లో ఏకంగా ఇద్దరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, ఒక తమిళ స్టార్ హీరో కూడా ఉండడం గమనార్హం. వారెవరో గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. గుర్తుపట్టారా? పర్లేదు లెండి ఎక్కువ ఆలోచించేయొద్దు.

Kajal kartheeka : వణికించడానికి కాజల్ కార్తిక మీ ఇంటికే వచ్చేస్తోంది గెట్ రెడీ!

ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఎవరంటే ఒకరు సుకుమార్ కాగా మరొకరు బొమ్మరిల్లు భాస్కర్. హీరో ఎవరో అని ఆలోచిస్తున్నారా ఆ పక్కనే ఉన్న జయం రవి. ఈ జయం రవి ఇంకెవరో కాదు మోహన్ రాజా సొంత తమ్ముడే. మన దగ్గర జయం సినిమా సూపర్ హిట్ కాగా దాన్ని తమిళ్ లో రీమేక్ చేశాడు మోహన్. రాజా తన తమ్ముడు హీరోగా చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మోహన్ రాజా తమ్ముడికి జయం రవి అనే పేరు ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ సినిమాకి సుకుమార్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేశారు. అప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా మీరు ఎవరో గుర్తుపట్టండి అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్ల.