టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ గురించి ఎంత చెప్పుకున్న తక్కవే అవుతుంది. దాదాపు 2001లో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరు.. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ దాకా అందరి సరసన ఎన్నో బ్లాక్ బస్టర్స్ మూవీస్ తీసింది. దశాబ్దంన్నర కు పైగానే టాప్ హీరోయిన్ గా వెలిగింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్‌కి మధ్య పోటి గురించి చెప్పకర్లేదు. కొత్త వారు వచ్చే కొద్ది పాత హీరోయిన్ లకు అవకాశాలు సహజంగానే తగ్గుతాయి. కొత్త జనరేషన్ దూసుకురావడంతో క్రమంగా ఫ్యామిలీ లైఫ్‌కి షిఫ్ట్ అయిపోయింది ఈ చిన్నది. అయినప్పటికి ప్రజంట్ కుటుంబం చూసుకుంటునే ఇటు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ‘ఆర్ఆర్ఆర్’, ‘కబ్జా’, ‘దృశ్యం 2’ లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించింది.ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఐటమ్ సాంగ్‌కి సిద్ధం అయింది ఈ ముద్దుగుమ్మ..
Also Read: Vishwak Sen: విశ్వక్ ‘లైలా’ ట్రైలర్ డేట్ ఫిక్స్..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రెట్రో’ ఒకటి.కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో శ్రియ మీద ఒక ప్రత్యేక గీతం చిత్రీకరించారట. మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డే పాత్ర మరీ హోమ్లీగా ఉండటంతో కొంచెం గ్లామర్ టచ్ కోసం శ్రియని తీసుకొచ్చినట్లు సమాచారం. జస్ట్ సాంగ్ వరకు మాత్రమే కాదు.. ‘జైలర్’ మూవీలో తమన్నా లాగా కొన్ని సీన్లు కూడా ఉంటాయని చెన్నై మీడియా టాక్. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందట థియేటర్లో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని సమాచారం. సూర్య, శ్రియ కాంబోలో గతంలో ఏ సినిమాలో రాలేదు.. మరి ఇందులో వీరిద్దరి మధ్య ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి అనేది చూడాలి.