NTV Telugu Site icon

Tollywood: వీళ్లలో ఒకడుంటేనే రచ్చ ఉంటది… ఇద్దరూ ఒక దగ్గరే ఉంటే అంతే ఇక…

Tollywood

Tollywood

తెలుగు హీరోల్లో రవితేజకి ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. తన మార్క్ హీరోయిజంతో స్టార్ గా ఎదిగాడు మాస్ మహారాజ రవితేజ. నాని కూడా దాదాపు ఇంత పక్కింటి కుర్రాడు అని ప్రతి ఒక్కరితో అనిపించుకున్న నాని ఈరోజు టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు. అందుకే రవితేజ, నానికి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి, అద్భుతాలు చెయ్యాలి అనే మాటని పూర్తిగా చెరిపేసి హీరో అంటే మనలాగే ఉంటాడు, మనలాగే మాట్లాడుతాడు అని నిరూపించిన రవితేజ, నానిలు ఎప్పుడూ హై ఆన్ ఎనర్జీతో ఉంటారు. ఇద్దరిలో ఒకరు ఉంటేనే ఆ ఏరియా అంతా సందడి సందడిగా, చిన్న సైజ్ పండగ చేస్తున్నట్లుగా ఉంటుంది. అలాంటిది రవితేజ, నాని ఒకే దగ్గర ఉంటే ఇంకెలా ఉంటుందో ఊహించొచ్చు.

రవితేజ, నానిలు కలిస్తే టెన్ థౌజండ్ వాలా పేల్చినట్లు ఎనర్జీ ఫైర్ లో ఉంటుందేమో. ఇలాంటి ఫైర్ నే ప్రమోషన్స్ కోసం వాడడానికి రెడీ అయ్యారు అభిషేక్ పిక్చర్స్ అండ్ SLV సినిమాస్. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రావణాసుర ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. నాని నటిస్తున్న పాన్ ఇండియా సినిమా మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. రెండు సినిమాల రిలీజ్ కి వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉండడంతో మేకర్స్ హెల్తీ కాంపిటీషన్ ని మైంటైన్ చేస్తూ రెండు సినిమాలని కలిపి ప్రమోట్ చేస్తున్నారు. ఇందుకోసం రవితేజ, నానిలతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూని రావణాసుర అండ్ దసరా మేకర్స్ ప్లాన్ చేశారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ ఇంటర్వ్యూతో రవితేజ, నానిలు చెయ్యబోయే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.