NTV Telugu Site icon

Kajal: కాజల్ కి సెకెండ్ ఇన్నింగ్స్ కలసి వచ్చేనా!?

Kajal

Kajal

కాజల్ పేరు వినగానే తను నటించిన పలు సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు రావటం ఖాయం. ఈ 37 ఏళ్ళ నటి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కరోనా టైమ్ లో పెళ్ళి చేసుకుని తల్లి అయిన కాజల్ నటిగా గ్యాప్ తీసుకుని ఫ్యామిలీ లైఫ్‌ కే పరిమితం అయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. తెలుగులో బాలకృష్ణ సరస ‘భగవంత్ కేసరి’ సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ‘సత్యభామ’ అనే టైటిల్ నిర్ణయించారు. తన కెరీర్ లో ఇది 60వ చిత్రం కావటం విశేషం. జూన్ 19న కాజల్ బర్త్ డే సందర్భంగా ‘సత్యభామ’ గ్లింప్స్ తో పాటు బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ నుంచి కాజల్ లుక్ ను విడుదల చేశారు.
నిజానికి 2004లో బాలీవుడ్ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చినా 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు చిత్రరంగంలో అడుగు పెట్టింది. ఆపై తమిళంలోనూ నటించింది. అయితే కృష్ణవంశీ ‘చందమామ’తనకు నటిగా పేరు తెచ్చిపెడితే రాజమౌళి, రామ్ చరణ్ ‘మగధీర’ స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత తెలుగు, తమిళ రంగాల్లో స్టార్ హీరోలందరితో నటించి దశాబ్దానికి పైగా ఓ వెలుగు వెలిగింది. 2018 నుంచి తన హవా తగ్గినా అడపా దడపా నటిస్తూనే వచ్చింది. ఇక 2020లో గౌతమ్ కిచ్చూతో తన పెళ్ళిని ప్రకటించింది. కెరీర్ లో పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా పని చేసిన కాజల్ ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమైంది. కాజల్ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ ఎప్పుడో షూటింగ్ పూర్తయినా విడుదల కావలసి ఉంది. ఇక ఎప్పుడో కమిట్ అయిన కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతోంది. ఇవి కాకుండా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ షూటింగ్ దశలో ఉంది. తనే ప్రధాన పాత్రధారిగా ‘సత్యభామ’ రూపొందనుంది. ఇందులో కాజల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపింనుంది. అఖిల్ డేగల డైరక్ట్ చేయబోయే ఈ సినిమాకు మరో దర్శకుడు శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే సమకూర్చాడు. ఇవి కాకుండా విజయ్ 68లోనూ తనే హీరోయిన్. అలాగే ఓ బాలీవుడ్ సినిమా కూడా కమిట్ అయింది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ కాజల్ కి ఏ మేరకు కలసి వస్తుందో చూడాలి.

Show comments