టాలీవుడ్ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి మరో అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఎంటర్ టైన్ మెంట్ లో లెజెండ్ గా పేరున్న కంపెనీ సోని తన ఓటీటీ విభాగం “సోని లివ్” తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డిని నియమించింది. తమ ఓటీటీలో వర్సటైల్ తెలుగు కంటెంట్ ను పెంచేందుకు శ్రీధర్ రెడ్డి అనుభవం, ప్యాషన్ బాగా ఉపయోగపడతాయని “సోని లివ్” మేనేజ్ మెంట్ నమ్ముతోంది. ఈ సందర్భంగా సోని ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్, సోని లివ్ కంటెంట్ హెడ్ ఆశిష్ గోల్వాకర్ మాట్లాడుతూ… “సోని లివ్” తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డి గారు మాతో జాయిన్ అవడం సంతోషంగా ఉంది. తనకున్న అనుభవంతో వీక్షకులకు నచ్చే వైవిధ్యమైన కంటెంట్ ను ఆయన తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అన్ని వర్గాల వీక్షకులు ఇష్టపడేలా “సోని లివ్” ను శ్రీధర్ రెడ్డి డెవలవ్ చేస్తారని నమ్మకం ఉంది” అన్నారు. మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… ”విశ్వవ్యాప్త వినోద రంగంలో సోని ఒక దిగ్గజ సంస్థ. ఇలాంటి సంస్థ ఓటీటీ “సోని లివ్” తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో “సోని లివ్” కు ఉన్న లెగసీని తెలుగులో మరింత ముందుకు తీసుకెళ్తేందుకు ప్రయత్నిస్తాను. మన తెలుగులోని వైవిధ్యమైన కంటెంట్ ను దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ఆదరించేలా తీసుకొస్తాం” అన్నారు.
‘సోని లివ్’ ఓటీటీ తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డి
