Site icon NTV Telugu

MM Keeravani: బ్రేకింగ్.. దర్శకుడు రాజమౌళి ఇంట తీవ్ర విషాదం..

Keeravani

Keeravani

MM Keeravani: పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి, పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీరవాణి తల్లి బుధవారం ఉదయం మృతిచెందారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఇంటివద్దనే చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె మృతిచెందినట్లు తెలుస్తోంది. దీంతో కీరవాణి, రాజమౌళి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీరవాణి, రాజమౌళి అన్నదమ్ములన్న విషయం తెల్సిందే.

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అన్నదమ్ములు.. కానీ అందరు ఉమ్మడికుటుంబముగా పెరగడంతో రాజమౌళికి పెద్దమ్మ అంటే ఎంతో ఇష్టమట. అందుకే ఆమె మృతదేహాన్ని రాజమౌళి ఇంటికి తరలిస్తున్నారు. ఇక రాజమౌళి ప్రతి సినిమాకు అన్న కీరవాణినే సంగీతం అందిస్తాడు. ఈ అన్నదమ్ములు ఎప్పుడు విడిపోయింది లేదు. ఇక వీరో కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉన్న విషయం తెల్సిందే.. ఈ నేపథ్యంలోనే వీరి ఇంట విషాదం నెలకొనడం బాధాకరమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఆమె మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version