సంక్రాంతి పండుగ అంటే తెలుగు ప్రజలకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద పండగే.. ప్రతి సంక్రాంతికి సినిమాల జాతర మాములుగా ఉండదు.. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సంక్రాంతి కే తమ సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటారు.. చాలామంది పండగల పూట సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడతారు. దసరా, సంక్రాంతి,దీపావళి ఇలా ప్రతి ఒక్క పండగకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈసారి సంక్రాంతికి వెంకటేష్,నాగార్జున,మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో పోటీగా తేజా సజ్జా సినిమా కూడా బరిలో దిగింది..
చిన్న సినిమా సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను కైవసం చేసుకుంది.. ఈ సినిమా ఇప్పటికే 265 కోట్లు కొల్లగొట్టింది. అంతే కాదు ఈ సినిమా ఇంకా థియేటర్ల లో రన్ అవుతుంది.. ఇప్పటికి ఈ సినిమా క్రేజ్ తగ్గలేదు.. ఆ తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం.. నాగార్జున నటించిన నా సామిరంగ, వెంకీ సైందవ్ సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి.. కలెక్షన్స్ పరంగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఎంత కలెక్షన్స్ ను రాబట్టాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైంది.. కలెక్షన్స్ పరంగా బాగానే అందుకుంది.. అలాగే గతంలో వచ్చిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా అలా వైకుంఠపురంలో సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యింది.. 260 కోట్లు రాబట్టింది.. చిరంజీవి, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రవితేజ ముఖ్య పాత్రలో బాబి దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య మూవీ 2023, జనవరి 12 సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై 230 కోట్లు కలెక్షన్స్ ను అందుకుంది..
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 జనవరి 10న సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 220 కోట్లను కొల్లగొట్టింది.. ఇలా సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న ప్రతి సినిమా కూడా వంద కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టాయి..