NTV Telugu Site icon

Tollywood: కిక్ అంటే ఇదేరా.. ఇంటర్నేషనల్ లెవల్లోకి టాలీవుడ్ మూవీస్!

Pushpa 2 Devaara

Pushpa 2 Devaara

టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియన్ క్రేజ్ క్రాస్ చేసి.. ఇంటర్నేషనల్ లెవల్లోకి వెళ్లిపోతున్నాయి. తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లింది బాహుబలి. కేవలం ఇక్కడే కాదు.. విదేశీ భాషల్లో రిలీజై సత్తా చాటింది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఫారన్ లాంగ్వేజ్‌లో విడుదలై సక్సెస్ అందుకున్నాయి. నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో డ్రాస్టిక్ ఛేంజ్ మొదలైంది బాహుబలితోనే. బీఫోర్ బాహుబలి.. ఆఫ్టర్ బాహుబలిలా టీటౌన్ స్టాండర్స్ మారిపోయాయి. గ్లోబల్ స్టాయిలో కాలరెగరేసేలా చేసింది బాహుబలి 2. ఈ మూవీకి ఇంటర్నేషనల్ లెవల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో పలు భాషల్లో రిలీజ్ చేశారు. జపాన్, రష్యన్, చైనా భాషల్లో డబ్ చేసి.. క్యాష్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు. డార్లింగ్ ప్రభాస్‌కు ఈ మూవీతోనే జపాన్‌లో ఫ్యాన్ బేస్ పెరిగింది. రెబల్ స్టార్ మూవీ రిలీజ్ అవుతుందటే.. దేశాలు దాటి సినిమా చూసేందుకు వస్తున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. బాహుబలి 2 ఇచ్చిన హైప్స్‌తో ఆర్ఆర్ఆర్ బిగ్ ప్లాన్‌తో రిలీజ్ చేశాడు రాజమౌళి. మార్కెట్ పరిధి పెంచి.. అంతర్జాతీయ స్థాయిలో త్రిబుల్ ఆర్‌ను రిలీజ్ చేశారు.

Jagtial: తిన్నతిండికి బిల్లు కట్టమంటే.. యజమానిపై దాడి చేసిన కస్టమర్లు..

మల్టీపుల్ లాంగ్వెజెస్‌లో విడుదల చేసి సరికొత్త ఎక్స్‌పీరియన్స్ చూపించారు. సినిమా వైడ్ రేంజ్ కలెక్షన్లు సాధించడానికి ఈ ట్రిక్ బాగా ఉపయోగపడింది. జపాన్‌లో కూడా త్రిబుల్ ఆర్‌ను రిలీజ్ చేయగా.. హ్యూజ్ కలెక్షన్లను రాబట్టింది. అంతేనా.. ఓటీటీలో ఓ రేంజ్ వ్యూస్ సాధించింది. సినిమాకున్న క్రేజ్ తెలుసుకున్న ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మూవీని సుమారు ఏడు భాషల్లో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. జపనీస్, చైనీస్, ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కీ, స్పానిష్ వంటి విదేశీ భాషల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంది. ఇప్పుడు దేవర వంతు స్టార్ అయ్యింది. ఆరేళ్ల తర్వాత దేవరతో సింగిల్‌గా వచ్చి సాలిడ్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకున్న దేవర పార్ట్ 1.. నవంబర్ 8న ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై.. మంచి వ్యూస్ రాబట్టుకుంది. ఓటీటీలో ఈ మూవీకి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ చూసిన ఓటీటీ సంస్థ.. మరిన్ని ఇంటర్నేషనల్ లాంగ్వెజ్‌లో సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్, బ్రెజిలియన్ పొర్చుగీస్ సహా పలు విదేశీ భాషల్లో మూవీని ప్రసారం చేయనుంది. వీటిని చూసి.. పుష్ప 2 కూడా ఇదే వేలో నడుస్తుందేమో చూడాలి మరి.