Site icon NTV Telugu

Tollywood Shooting Updates: రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీ, బాలయ్య, శర్వా.. ప్రభాస్ మాత్రం?

Telugu Movie Shooting Updates

Telugu Movie Shooting Updates

Tollywood Movie Shooting Updates: తెలుగు సినీ పరిశ్రమలో అనేక ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి దాదాపుగా స్టార్ హీరోలు అందరూ షూటింగ్స్ తోనే బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఏ ఏ సినిమా షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమా షూటింగ్ శంకరపల్లి లో జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లక్నోలో జరుగుతుంది.

Nandamuri Hero: షాకింగ్: మోక్షజ్ఞ కంటే ముందే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు..

ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నాని హీరోగా సరిపోదా శనివారం సినిమా షూటింగ్ బీహెచ్ఈఎల్ లో జరుగుతుంది. నితిన్ వెంకీ కుడుముల సినిమా రాబిన్ హుడ్ షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతుండగా నాగ చైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో నటిస్తున్న తొండెల్ సినిమా షూటింగ్ బీహెచ్ఈఎల్ లో వేసిన ఒక స్పెషల్ సెట్లో జరుగుతోంది. ఇక అలాగే శర్వానంద్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షక ముందుకు రాబోతున్నాయి ఆ మూడు సినిమాల యూనిట్స్ ప్రస్తుతానికి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాయి. టిల్లు స్క్వేర్, కలియుగం పట్టణంలో, భరతనాట్యం సినిమాలు ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్నాయి.

Exit mobile version