NTV Telugu Site icon

Tollywood: మీ చుట్టూ సోషల్ మీడియా తిరగాలి కానీ.. మీరు తిరిగితే ఎలా?

Mahesh

Mahesh

Tollywood Makers Following Social Media Blindly: కుక్క తోకను ఊపాలి కానీ తోక ఎక్కడైనా కుక్కను ఊపుతుందా ? అనేది తెలుగులో పాపులర్ సామెత. ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ చూస్తే అలానే అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నామని చెబుతూ ఒక ప్రోమో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అయితే సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ ఈ కొచ్చి మడత పెట్టి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో దాదాపు క్లారిటీ ఉంటుంది. ఒక వయసు మళ్ళిన వ్యక్తి హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ బయట తన ముందు పెట్టిన మైక్ లో ఎప్పుడో తన జీవిత కథను చెబుతూ ఈ డైలాగు వాడాడ. ఆ తర్వాత ఆ డైలాగు బూతులతో ఉన్నా ఎందుకో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. దాని మీద చాలా మంది రీల్స్ కూడా చేస్తూ వచ్చారు. దాదాపు జనం ఇప్పుడు ఆ పదాన్ని మరిచిపోతున్నారు అనుకుంటున్న సమయంలో మహేష్ బాబు సినిమాకి పాట ఓపెనింగ్ అదే పదంతో మొదలుపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని మహేష్ అభిమానులైతే జీవించుకోలేకపోతున్నారు.

Devil Movie Review: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ రివ్యూ!

సోషల్ మీడియాలో తమన్ సహా త్రివిక్రమ్ శ్రీనివాస్ లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రిని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి సోషల్ మీడియాలో పాపులర్ అయిన పదాలను ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా వాడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ డం ఉన్న హీరో నోటి చేత కెసిపిడి అని పలికించారంటే ఈ ట్రెండ్ ఎంతలాగా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఒకప్పుడు, ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా సినిమాల్లో చూపించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మేకర్స్ బద్దకమో లేక దానికి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఆలోచనో తెలియదు కానీ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న ఇలాంటి పదాలను తీసుకొచ్చి హీరోల చేత పలికించడం, హీరోలకు పాటలుగా పెట్టించడం జరుగుతోంది. ఉదాహరణకు ఈ రెండే ఉన్నా కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన విషయాలను ప్రస్తావించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయిపోయిందో లేక సినిమా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళ బుర్ర అక్కడికి ఆగి పోయిందో అర్థం కావడం లేదని నెటిజనులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.