Site icon NTV Telugu

Satya: టాలీవుడ్ లో విషాదం.. హీరో సత్య హఠాన్మరణం

Satya

Satya

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. మొన్నటికి మొన్న సింగర్ కేకే మృతి చిత్ర పరిశ్రమను కోలుకోలేనంత విషాదాన్ని మిగిల్చింది. ఇంకా ఆ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోకముందే మరో హీరో గుండెపోటునితో మృతి చెందడం షాక్ కు గురిచేస్తోంది. ‘వరం’, ‘బ్యాచిలర్స్’ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన సత్య గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయమైన సత్య పూర్తి పేరు వి. రామసత్యనారాయణ. పలు స్టార్ హీరోల సినిమాలలో హీరోకు ఫ్రెండ్ గా నటించిన సత్య ‘వరం’ సినిమాతో హీరోగా మారాడు.. ఈ చిత్రం ఆశించిన ఫలితం అందివ్వలేకపోయింది. ఈ సినిమా తర్వాత ‘బ్యాచిలర్స్’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అది కూడా బోల్తా పడడంతో ఇండస్ట్రీకి స్వస్తి పలికి కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు.

ఇక కరోనా సెకండ్ వేవ్ లో వరుసగా తల్లిని, భార్యను పోగొట్టుకొని జీవచ్ఛవంలా బ్రతుకుతున్న ఆయన గతకొన్నిరోజులుగా అనారోగ్య సమస్యల్తో బాధపడుతున్నాడు. ఇక హఠాత్తుగా గురువారం సత్య గుండెపట్టుకొని ఛాతిలో నొప్పి అని అరవడం.. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఇక సత్యకు 8 ఏళ్ల కూతురు ఉంది. మొన్న తల్లిని, ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్న ఆ చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. సత్య మరణవార్త తెలిసిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలుపుతున్నారు.

Exit mobile version