బాషతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమలలో సుదీర్ఘ అనుభవం గల దర్శక, నిర్మాత సత్యారెడ్డి హాలీవుడ్‌లోకి అడుగు పెట్టే సన్నాహాలను చేస్తున్నారు. ఆయన తాజాగా హాలీవుడ్ స్థాయి సినిమా నిర్మించడానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ బుద్ధ’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, పాన్ వరల్డ్ సినిమాస్ అనే పేరుతో ఒక బ్యానర్ కూడా రిజిస్టర్ చేశారు.
Also Read : Anupama Parameswaran : అతని జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి..
సుమారు 15 సంవత్సరాల క్రితం ‘సర్దార్ చిన్నపరెడ్డి’ చిత్రంతో సినీ జీవితం ప్రారంభించిన సత్యారెడ్డి, ఆ తర్వాత ‘ప్రేమికుల రోజు’, ‘కుర్రకారు’, ‘రంగుల కళ’, ‘శంకర్ దాదా జిందాబాద్’ వంటి చిత్రాలతో తాను ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన 55కి పైగా సినిమాల్లో డైరెక్టర్, నిర్మాత, హీరోగా పనిచేసి సినీ పరిశ్రమలో ఖచ్చితమైన స్థానం సంపాదించుకున్నారు. దర్శకత్వంలో, నిర్మాతగా మాత్రమే కాకుండా, నటుడిగా కూడా తన ప్రత్యేక శైలిని చూపుతూ, నిర్మాతల మండలి లో కీలక పాత్రలో ఉంటారు. 2016 లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గా కూడా ఎన్నుకోబడ్డారు.
ఇటీవల సత్యారెడ్డి ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే సినిమాను నిర్మించారు. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా యుద్ధాన్ని చూపిన చిత్రం. ఈ ప్రాజెక్ట్‌లో రష్యా, అమెరికా వంటి దేశాల హాలీవుడ్ నటులతో పని చేయడం ద్వారా, తదుపరి ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘కింగ్ బుద్ధ’ షూటింగ్ కోసం ఇప్పటికే అమెరికా, చైనా, టిబెట్, నేపాల్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో లొకేషన్లను పరిశీలించారు. ప్రస్తుతం చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో అమెరికా లో ప్రసిద్ధుల సమక్షంలో పోస్టర్ లాంచ్ తో అన్ని వివరాలు వెల్లడించనున్నట్లు సత్యారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్‌లో ఒక పాన్ వరల్డ్ విజన్ తో తెరకెక్కుతున్న ప్రత్యేక చిత్రం కావడంతో, ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
