Site icon NTV Telugu

Tollywood Director:టాలీవుడ్ డైరెక్టర్ తో యాంకర్ పెళ్లి

Untitled 1 Copy

Untitled 1 Copy

Tollywood Director Kishore Reddy married Anchor KC: తెలుగు సినీ దర్శకుడు తెలుగు యాంకర్ ను వివాహం చేసుకున్నారు. ఆయన మరెవరో కాదు శర్వానంద్ హీరోగా శ్రీకారం అనే సినిమా డైరెక్ట్ చేసిన కిషోర్ రెడ్డి. శర్వానంద్ హీరోగా రైతుల సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా శ్రీకారం అనే సినిమా తెరకెక్కించారు కిషోర్. ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యను వివాహం చేసుకున్నారు. యాంకర్ కేసీగా తెలుగు సినీ వర్గాలకు సుపరిచితమైన కృష్ణ చైతన్య కొల్ల గతంలో ఆర్జేగా కూడా పనిచేశారు. ఆర్జే స్మైలీ క్వీన్ పేరుతో ఆమె రేడియో జాకీగా వ్యవహరించేవారు. ఇక వీరి వివాహం ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగింది.

Niharika Konidela: ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి.. హోప్ వదలకూడదు

ఇక నిన్న రాత్రి ఆరు గంటల నుంచి వీరి రిసెప్షన్ కూడా అదే దేవస్థానంలో జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మీడియా రంగానికి చెందిన వారు వీరి వివాహానికి హాజరయ్యారు. వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు కానీ రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు మీడియా ప్రముఖులు సైతం వారి వివాహానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెడుతున్నారు. యాంకర్ కేసి గతంలో ఈటీవీలో ప్రసారమైన కొన్ని స్టూడెంట్ గేమ్ షోలకి యాంకర్ గా వ్యవహరించింది. అలాగే పలు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఆమె యాంకర్ గా అనేక ఇంటర్వ్యూస్ లో పాల్గొంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె పలు సినిమా ఈవెంట్లకు కూడా యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. అయితే వీరిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిరిచిన వివాహమా అనే విషయం మీద క్లారిటీ లేదు.

Exit mobile version