Site icon NTV Telugu

Allu Ramesh: యూట్యూబ్ ను షేక్ చేసిన ‘మా విడాకులు’ మామయ్య ఇక లేరు

Ramesh

Ramesh

Allu Ramesh: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేష్ గతరాత్రి మృతి చెందారు. సడెన్ గా గుండెపోటు రావడంతో ఆయన విశాఖపట్నంలోని తన స్వగృహంలో మృతి చెందినట్లు సమాచారం. అల్లు రమేష్.. ఒక నాటకకళాకారుడు. చిన్నతనం నుంచి నాటకాల్లోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించి మెప్పించారు. తోలుబొమ్మలాట. రావణ దేశం, మధురా వైన్స్, నెపోలియన్ లాంటి సినిమాల్లో అల్లు రమేష్ మంచి పాత్రల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ను షేక్ చేస్తున్న వెబ్ సిరీస్ మా విడాకులు.

Trisha: స్వర్గం నుంచి దిగివచ్చావా.. నిత్యం అమృతమేమైనా తాగుతున్నావా..?

ప్రసాద్ బెహరా దర్శకత్వం వహించి, నటించిన ఈ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ రీల్స్ లో ఈ సిరీస్ కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్ లో హీరోకు మావయ్యగా అల్లు రమేష్ నటించాడు. ప్రసాద్- మావయ్య ల కామెడీ సిరీస్ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ తో రమేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇంత మంచి గుర్తింపు అందుకొని వరుస అవకాశాలు అందుకొనే సమయంలోనే ఆయన హఠాన్మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తుందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. రమేష్ మృతి పట్ల మా విడాకులు టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version