Site icon NTV Telugu

Prabhas: చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం.. ఏం చేయలేకపోయాం.. కానీ..

prabhas

prabhas

ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమత్రి సీఎం జగన్ తో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ ముగిసింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ, కమెడియన్ ఆలీ, నటుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను సీఎం కి తెలిపి ఒక పరిష్కారాన్ని కోరారు.

ఇక భేటీ అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు.. చాలా సమయం ఇచ్చారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలను తెలిపాము… ఆయన అర్ధం చేసుకున్నారు. చిరంజీవి గారికి థాంక్స్ చెప్పాలి.. ఎందుకంటే 7, 8 నెలల నుంచి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం.. చిరంజీవి గారు వచ్చి ఈ సమస్యకు ఒక ఫినిషింగ్ ఇచ్చారు.  చిరంజీవి గారి వల్లే ఇది సాధ్యమైంది. పేర్ని నాని గారికి థ్యాంక్స్ సర్” అని చెప్పుకొచ్చారు. ఇక సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఫిబ్రవరి మూడో వారంలోపు శుభం కార్డు పడుతుందని సినీ పెద్దలు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం దొరికిందనే టాలీవుడ్ ఆశపడుతోంది. ఫిబ్రవరి చివరి వారంలో ఏం జరగనుందో చూడాలి.

Exit mobile version