Site icon NTV Telugu

త్వరలోనే సీఎం జగన్‌తో సినీ పెద్దలు భేటీ

టాలీవుడ్ ప్రముఖులు త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం రెడీ అయింది. అయితే ఇదివరకే ఈ భేటీ జరగాల్సిఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఇకపోతే థియేటర్ టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ రంగం ఇలా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు సినీ ప్రముఖులు. అలానే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా చిరంజీవి బృందం కొన్ని మార్పులు కోరే అవకాశం కనిపిస్తోంది.

అయితే, తాజాగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాళ్ల యాజమాన్యాలతో త్వరలో సమావేశం జరపనున్నామని తెలిపారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ నేతృతంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. త్వరలోనే సినీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ కానున్నారని’ మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ నెల 20వ తేదీన ఈ భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరి చిరు బృందంలో ఎవరెవరు కలిసి ముందుకు వెళ్తారనేది చూడాలి!

Exit mobile version