బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మహారాజ. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న ‘మాస్ జాతర’ అక్టోబరు 31న రిలీజ్ కు రెడీ అవుతోంది. మాస్ జాతర సెట్స్ పై ఉండగానే నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసాడు.రవితేజ కెరీర్ లో 76వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రవితేజ స్టైల్ కామెడీ, కిషోర్ టేకింగ్ లో ఉండే ఎమోషన్స్ తో కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా రాబోతోంది.
Also Read : NBK111 : మరో విధ్వంసానికి ముహూర్తం పెట్టిన బాలయ్య – గోపీచంద్ మలినేని
ఈ సినిమా కోసం ఓ క్యాచీ టైటిల్ ను అనుకుంటున్నారట మేకర్స్. కిషొర్ తిరుమల రైటింగ్ లోని సున్నితమైన టచ్.. మాస్ మహారాజా సినిమాలకు ఉండే మాస్ టచ్ ఉండేలా ఓ టైటిల్ ను పరిశీలిస్తున్నారట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ను పరిగనిస్తున్నారట దర్శకుడు కిషోర్ తిరుమల. ఆల్మోస్ట్ ఇదే ఇదే ఫిక్స్ చేస్తారని కూడా తెలిస్తోంది. రవితేజ సినిమాలకు ఇలాంటి పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. అటు ఫ్యాన్స్ కూడా రవితేజ నుండి ఇలాంటి సినిమాలనే కోరుకుంటున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నెలాఖరుకు టోటల్ షూటింగ్ ఫినిష్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.
