Pareshan: ‘మసూద’తో బిగ్ హిట్ అందుకున్న యంగ్ హీరో తిరువీర్ ఇప్పుడు రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ‘పరేషాన్’ అనే హిలేరియస్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జూన్ 2న ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. తెలంగాణ లోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వాసు పెండం డీవోపీ గా వ్యవహరిస్తుండగా యశ్వంత్ నాగ్ సంగీతం సమకూర్చుతున్నారు. శ్రీపాల్ ఆర్ట్ డైరెక్టర్.
Rana Daggubati: ‘పరేషాన్’ చేయబోతున్న తిరువీర్!
Show comments