Saravanan: ‘ది లెజెండ్’ వెనుక తిరుపతి ప్రసాద్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ స్టార్ హీరో నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీలో నటిస్తుంటే… పక్కన కర్ణాటకలోని మరో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ‘ఘోస్ట్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. అలానే ఆ మధ్య నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’తో జనం ముందుకు వస్తే… ఇప్పుడు తమిళనాడులో శరవణన్ ‘ది లెజెండ్’ పేరుతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శరవణన్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన ఈ మాస్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, జెడి-జెర్రీ సమకూర్చి, దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 28న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘ది లెజెండ్’ థియేట్రికల్ హక్కులను వివిధ పరిశ్రమల్లోని ప్రముఖులు సొంతం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ఒక సామాన్యుడు తన శ్రమ, సమర్ధత, బలంతో అన్ని అడ్డంకులను అధిగమించి ‘లెజెండ్’గా ఎలా నిలిచాడనేది ఈ సినిమాలో గ్రాండియర్ గా చూపించబోతున్నారు. శరవణన్ మైక్రో బయాలజీ శాస్త్రవేత్తగా కనిపించనున్న ఈ మూవీ మెడికల్ మాఫియా నేపధ్యంలో రూపుదిద్దుకుంది. చెన్నై, కుంభకోణం, పొల్లాచ్చి, హిమాలయాల్లో దీని చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో భారీ సెట్ వేశారు. ముఖ్యమైన సన్నివేశాలు, పాటలను ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభానికి ముందు చిత్రీకరించారు. ఐటమ్ సాంగ్స్ తో పాపులరైన ముంబై మోడల్ ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ప్రముఖ హాస్యనటుడు వివేక్కి ఇదే చివరి సినిమా. అలానే మరో కమెడియన్ యోగిబాబు ఇందులో కీలక పాత్ర పోషించాడు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, ఆర్వేల్రాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.
తాజావార్తలు
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!