Site icon NTV Telugu

Pushpa: పాన్ ఇండియా ‘పుష్ప’ రష్యాలోనూ ‘రైజ్’ అవుతుందా?

Pushpa

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’, ‘నీ అవ్వ తగ్గదే లే’, ‘పార్టీ లేదా పుష్ప’ లాంటి డైలాగ్స్  ఇండియా వైడ్ ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని వార్నర్ నుంచి బాలీవుడ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేశారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ‘పుష్ప ది రైజ్’ సినిమాని సుకుమార్ అండ్ టీం రష్యాలో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 8న పుష్ప ది రైజ్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందనే అనౌన్స్మెంట్ ఇప్పటికే బయటకి వచ్చేసింది. దీంతో పుష్ప ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఇటివలే రష్యా వెళ్లారు. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీం… అక్కడ పుష్ప సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేశారు.

రష్యాలో పుష్ప టీంకి గ్రాండ్ వెల్కం దక్కింది. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రీమియర్స్ వేశారు, ఈ ప్రీమియర్స్ కి వచ్చిన ఆడియన్స్ ‘పుష్ప’ చిత్ర యూనిట్ కి కాంప్లిమెంట్స్ అందించారు. అక్కడి ఆడియన్స్ మన సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని సమాచారం. ఈ సంధర్భంగా మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో పుష్ప టీం రష్యాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రమోషన్స్ ని ఎలా చేశారు అనే వరకూ కవర్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. రష్యాలో ఒక ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. మరి మన దగ్గర పాన్ ఇండియా హిట్ అయిన పుష్ప, రష్యాలో కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

Exit mobile version